Thursday, April 5, 2018

అరకు కాఫీ.. అంతర్జాతీయ ఖ్యాతి


నాగరికత ప్రస్ధానంలో మద్యేతర పానీయాలు  కేవలం మూడిటిమటుకే అన్ని దేశాల్లో సార్వజనీనంగా ఆదరణ లభించింది. ఈ మూడిటిలో మొదటిస్ధానంలో టీనిలబడితే రెండోస్ధానంలో కాఫీ, మూడో స్ధానంలో కోకోవుంటాయి. అయితే అంతర్జాతీయంగా జరిగే వ్యాపారపరంగా చూస్తే కాఫీ’, పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత ఎగుమతి దిగుమతి చేసుకునే అతి పెద్ద ఉత్పాదన. కాఫీకి వున్న వ్యామోహం ఆదరణ చూస్తే ఆది ఒక కొత్తరకపు నాగరికతకీ, జీవనశైలికి చిహ్నంగా మారింది. కాఫీ అనేది యిపుడు మనిషికి అవసరమైన పానీయం స్ధాయి నించి ఎదిగి శక్తినీ, ఉత్పాదకతనూ పెంచే ఔషధం స్ధాయికి చేరిందనడంలో సందేహం లేదు.
కాఫీ పుట్టుక
కాఫీ ప్రపధమంగా ఆఫ్రికా ఖండంలో పుట్టి యితర దేశాలకు వ్యాప్తి చెందింది. ఇపుడు సుమారు 70 దేశాలలో కాఫీ పండుతోంది. ఇధియోపియాలోని ఖఫా ప్రాంతంలో ఓరోమె తెగకు పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించడం జరిగింది. ‘కల్డిఅనే ఇధియోపియాకు చెందిన పశువుల కాపరి కాఫీమొక్కను గుర్తించినట్టు చరిత్ర చెబుతోంది. ఇధియోపియా నించి క్రమంగా యిది అరేబియాకి వ్యాప్తి చెందింది.
భారతదేశంలో కాఫీ
16వ శతాబ్ధంలో సూఫి సన్యాసి బాబా బూదాన్‌ ఏడు కాఫీ గింజల్ని అరేబియా దేశస్తుల కళ్ళుగప్పి భారతదేశం తీసుకువచ్చాడు. వాటిని కర్ణాటకలోని చిగ్‌మగళూర్‌లో తన ఆశ్రమంలో నాటాడు. అక్కడ్నించి వ్యాప్తి చెంది భారతదేశంలో 16 రకాల కాఫీగా యిపుడు పండిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ
1898లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిషు అధికారి బ్రాడీచేత కాఫీ పంట ప్రారంభమైంది. అక్కడ్నించి  పుల్లంగి, విశాఖ జిల్లా గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి మరియు చింతపల్లి ప్రాంతాలకి విస్తరించినా అది విసృత వ్యాప్తికి నోచుకోలేదు.
అరకు కాఫీపుట్టుక
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాలలో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పచెప్పారు.
1956 లో గిరిజన సహకార సంస్ధ ఏర్పాడ్డక, కాఫీ బోర్డు వారు యీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం వుపయోగించుకోవాలని వుద్దేశించారు. ఆ రకంగా గుర్తింపబడి, గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభమైంది. 1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృది
విభాగం పనిచేస్తూ సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. ఈ రకంగా సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి అరకుకాఫీఅనే పేరు స్ధిరపడింది.
1985 తర్వాత జిసిసి ఆధ్వర్యంలో అరకుకాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్ధ (గిరిజన కోఆపరేటివ్‌ ప్లాంటేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) స్ధాపించారు. ఈ రకంగా జిసిసిద్వారా మరియు జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పంచి ఇచ్చారు.
1997 జూలైలో జిసిపిడిసి సంస్ధ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎ లో విలీనంచేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికబద్ధంగానూ, MGNREGS నిధుల సహాయంతో అభివృద్ధి చేసి యీ నాటికి లక్ష ఎకరాలకు చేరి, కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు.
అరకు కాఫీ ప్రత్యేకతలు
భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రాంతం కాఫీ తోటల పెంపకంలో గత శతాబ్ధి కాలంలో బాగా అభివృద్ధి చెందితే, తూర్పుకనుమల ప్రాంతం కాఫీ పంటలో యింకా అభివృద్ధి చెందుతూనేవున్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖజిల్లా అరకు ప్రాంతం అత్యంత అందమైన ప్రాంతమేకాక అత్యంత అందమైన పక్షులు, రామచిలకలకు ఆలవాలంగా వుంది. అరకు ప్రాంతంలోని అరేబికారకం కాఫీ అత్యంత ప్రసిద్ధి చెందింది. పనస, సిల్వర్‌ఓక్‌, మరియు అరటి చెట్ల నీడలో పెరిగే యీ కాఫీ సేంద్రియ పద్దతుల్లో సాగుచేయబడుతున్నది. కాగా, యీ ప్రాంత అటవీ సంపదను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడేదిగా వుంది. అరకులోయలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలో లక్షకు పైగా గిరిజన రైతులు యీ కాఫీ పంట ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ ప్రాంత గిరిజనులు తాము సాంప్రదాయకంగా చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిస్తున్నారనేది అందరికీ ఆహ్లాదకరమైన వార్త. అరకులోయలోని కాఫీ పంట ప్రకృతికి మంచిచేసేదిగా, గిరిజనులకు కల్పతరువుగా మారిందంటే అతిశయోక్తి లేదు.
అరకు కాఫీకి అద్భుత రుచి ఎలా వచ్చింది?
అరకులోయలో పండుతున్న కాఫీ సుమారు 900 నుంచి 1100 మీటర్ల ఎత్తున పండినదైనందువల్ల యిక్కడి నేలలో మితమైన క్షారగుణం కలిగినందువల్ల యిక్కడి పండే కాఫీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి.
కాఫీ గింజల పరిమాణం లోగాని, నేలసారం వలన కలిగే గుణాల వలన, మితమైన పుల్లటి జీర జిహ్వకి తగులుతూ, స్పష్టమైన గాఢతర సువాసన, మరియు నాలుకకి తగలగానే నరాల్ని కదిలించే క్షారగుణంతో అరకు కాఫీఒక ప్రత్యేకమైన రుచి గల కాఫీగా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.
ఆకెళ్ళ రవిప్రకాష్ (raviprakash2525@gmail.com, Call-9490517777)



Wednesday, April 12, 2017

Saturday, January 14, 2017

కనుమ పండగ


ఈ పండగ ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకి ఈ కనుమ రోజు పూజ చేయడం జరిగింది.అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి తరువాతి రోజున కనుమ జరుపుకొంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి మరియు గోవులకు ఎడ్లకూ పూజ చేయడం జరుగుతుంది,ఇంకా ఈ రోజున పల్లెల్లో
రైతుకు వ్యవసాయంలో సహకరించే
పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున
పశువుల
పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు,
కొత్తబియ్యంతో
పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి
నైవేద్యం పెట్టిన
తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే
పొలి
చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ
సంవత్సరం పాటు పండే పంటలకు చీడ-
పీడలు సోకకుండా
కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.
ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది
వారి నమ్మకం.
అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ
కలిసి కొద్దిగా
కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి
పొంగలిని
చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి
కాయను దిష్టి తీసి
పగులకొడతారు. కనుమనాడు ఆవులు,
ఎద్దులు, గేదెలు,
దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు,
బెలూన్లతో
అలంకరించి పూజించటం జరుగుతుంది. ఆ
రోజున వాటితో ఏ
పని చేయనీయక వాటిని పూజ్య భావంతో
చూస్తారు.
ఎందుకంటే పల్లెల్లో పశువులే గొప్పసంపద,
అవి ఆనందంగా
ఉంటే రైతుకి ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర
ఎంతో ఉంది.
వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా
కనుమను భావిస్తారు.
మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో
‘కనుమ'
నాడు ‘మినుములు' తినాలనే ఆచారం. అందుకే
‘మినపగారెలు'
చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన
ఆడపిల్లలు,
అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా
కనుమ
రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ
రోజు కాకి కూడ
కదలదని సామెత. కనుమనాడు తప్పక
మాంసాహర విభిన్న
రుచులను వండుకొని తింటారు.
ఆహ్లదకరమైన వాతావరణంలో
సంతోషాలు వెళ్ళువిరిసే ‘కనుమ’
అలాగే ఈ రోజున బొమ్మల
కొలువు ఎత్తటం అని
పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి
ఒక
బొమ్మను శాస్త్రార్థ పరంగా ఎత్తి పెడతారు.
అంతే
కాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల
రాకపోకలు, ఎడ్ల
పందాలు, ఎడ్లను ఊరేగించడం, కొన్ని
ప్రాంతాల్లో కోడి
పందాలు, బంతిపూలతో తోరణాలు, కొత్త
జంటల విహారాలు,
బావమరదల్ల ఇకఇకలు, పకపకలు ఎంతో
ఆహ్లదకరంగా
ఉంటాయి. ఇదే కనుమ యొక్క ప్రత్యేకత..
కనుమ పండుగ! జంతువులను పూజించే పండుగ!!
వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - #యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.
ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.
ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.
మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే #జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేద్దాం.
చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది,

సంక్రాంతి పండుగ ...


సంక్రాంతి అంటే మార్పు...మారడం,చేరడం అనే అర్ధాలు ఉన్నాయి.రవి సంక్రమణం రోజున స్నానం చేయ్యని నరుడు ఏడు జన్మలదాకా రోగి,నిర్ధనుడు అవుతాడు.కనుక సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి ,పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి.కొందరు నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేస్తారు.శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది.ఈ సంక్రమణకాలంలో ధాన్యం,ఫలాలు,విసనకర్ర , వస్త్రం, గుమ్మడి, సువర్ణం, కాయగూరలు, దుంపలు,తిలలు,చెఱకు,గోవు మొదలైనవి దానం చేయాలి.ఈ రోజున వస్త్రదానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

దేవఋణం, పితృఋణం,మనుష్యఋణం,ఋషిఋణం, భూతఋణం అనే పంచ ఋణాల నుంచి విముక్తిని పొందే మార్గాలను ప్రతి గృహస్థుడు ఏ విధంగా ఆచరించాలో ఒక ఆచారాన్ని నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి.










దేవఋణం
ఇంద్ర,వరుణ,వాయు దేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించుట వల్లనే మకర సంక్రాంతి పండగ నాటికి పంటలు సమృద్ధిగా పండి,రైతు చేతికి అందుతాయి.తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది.అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి,సూర్యాది దేవతలను పూజించి,కొత్త బియ్యంతో పొంగలి,పులగం తయారుచేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించడం మన ఆచారం.

పితృఋణం
పితృ తర్పణాలు ,పిండోదక దానాలు,శ్రాద్ధకర్మలు మొదలగునవి ఆచరించడం ద్వారా , మరణించిన పితృల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు.మకర సంక్రాంతినాడు తెలక పిండి(నువ్వులపిండి) ఒంటికి రాసుకుని స్నానం చేయడం ఒక ఆచారం.ఎందుకంటే మకర రాశికి శని అధిపతి.శని వాత ప్రథాన గ్రహమంటారు.వాతం తగ్గాలంటే ఈరోజు తెలకపిండితో స్నానం చేసి,నువ్వులు,బెల్లం,గుమ్మడికాయ మొదలైనవి దానాలు ఇవ్వడమే దీనికి పరిహారం.కాబట్టే నువ్వులు, బియ్యంపిండి, బెల్లంతో చేసిన అరిసెలను అంతా కూడా తింటుంటారు.

భూతఋణం
నీరు,భూమి,గాలి,ఆకాశం,అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి.అందుకే కృతజ్ఞతతో పంచభూతాలను కూడా పూజిస్తాం.పండిన పొలాల్లో పొంగలి మెతుకులు ,పసుపుకుంకాలు చల్లి ఎర్ర గుమ్మడి కాయను పగులకొట్టి దిష్ఠి తీయడం ఆచారమైంది.పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి.ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి.కాబట్టే కృతజ్ఞాతాసూచకంగా 'కనుమ' నాడు పశువులను, పశుశాలను శుభ్రం చేసి అలంకరిస్తారు.వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు.ఇళ్ళ ముంగిట బియ్యం పిండితో రంగవల్లులు వేస్తారు.ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహరం.ఇలా మూగ జీవులకు ,భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాన్ని ఈ పండుగ నిర్దేశించింది.

మనుష్యఋణం
ఇతరుల సహాయసహకారాలు లేనిదే సమాజంలో జీవనం సాగించలేం.అందుకు కృతజ్ఞతగా ఈ పండుగనాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, ఫలాలు, వస్త్రాలు, బంగారం వంటివి విరివిగా దానధర్మాలు చేస్తారు.అతిథులను ఆదరిస్తారు.వ్యవసాయంలో సహాయం చేసినవారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ
కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా సంక్రాంతిలో మరొక ఆచారం.

ఋషిఋణం
సంక్రాంతి సాధనలు, సత్ గ్రంధ పఠనాదులూ శిఘ్రఫలాలనిస్తాయని విశ్వసిస్తారు.వీటిని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుందని భావిస్తారు.

భోగి పండుగ


సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ చాలా సందడితో అందరిలో ఆనందాన్నినింపుతుంది.
అలికిన వాకిళ్ళలో అందమైన రంగువల్లులు, ముచట గొలిపే గొబ్బమ్మలు, గొబ్బెమ్మలలో అమరిచిన అందమైన పూల ముగ్గుల మధ్య ముచ్చటైన అడుగులు వేసే హరిదాసులు, హరిదాసుల చెక్క భజనతో వినిపించే భక్తి గీతాలు. డుడు బసవన్నల ఊరేగింపు ఉత్సవాలు భోగి మంటలు, పొంగలి వంటలు, చేమ్మచేక్కలాటలు ఉత్సాహం ఉత్సాహం అంతటా పండుగ ఉత్సాహం. ఈ సంప్రదాయం వెనుక దాగివున్న సంస్కృతిని ఒక్కసారి పరిశీలిస్తే











ముగ్గులు - శుచి, శుభ్రతకు సంకేతాలు - వాకిట్లో ముగ్గు పెట్టకుండా భర్త బయటకు వెళ్ళకూడదు అనేమాట అనాదిగా వింటున్నాం. దీనివెనుక అంతరాద్దన్ని గమనిస్తే భర్త బయటకు బయలుదేరటానికిముందే ఉదయాన మేల్కొని వాకిలి వూడిచి ముగ్గు పెట్టాలి. ఇది యిల్లాలిలో కలిగించి భాద్యతను తెలిపెమేలుకోలుపు. వాకిలి చిమ్మటం అంటే బద్ధకం వదిలి పొద్దున్న లేవాలి. చల్లని నీళ్ళతో వాకిలిని కడిగితే కొంత బద్ధకం పోతుంది. ముగ్గు వేయటానికి కొంత మేదస్సు కావాలి. చుక్కలు లెక్కలు వేసి ముగ్గు వేయటంతో పూర్తి బద్ధకం దూరమై దినచార్యకి అవసరమైన పూర్తి చతన్యం కలుగుతుంది. వివాహానంతరం గృహినికి ముగ్గు వేస్తూ తదుపరి తన పుత్రికకు కబోయే గృహినికి ముగ్గు సంప్రదాయం ద్వారా చితన్యం అందించటం జరిగుతుంది. నేడు ఈ ముగ్గు సంప్రదాయం విడిచిన ప్రాంతాల్లో స్త్రీలు కూడా బారెడు పొద్దు ఎక్కాక నిద్ర లేస్తున్నారు - కుసంస్కరాలకు బానిసలవితున్నారు.
గొబ్బెమ్మలు: ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయటం మన సంప్రదాయం. ఆవు పేడ రోగ నిరోధకం, చలి కలం వచ్చే కాళ్ళకలక, ఆటలమ్మ, తడపరలాంటి వ్యాదులు గుమ్మం దాటి లోపలికి రాకుండా ప్రతి గుమ్మంలోను గొబ్బెమ్మలు నిరోదిస్తాయి.










హరిదాసులు: ఉదయాన్నే భక్తి గీతాల ద్వారా నీతిని భోదిస్తూ చెక్క భజనలతో అందరిలో బద్ధకం పోగొడుతూ చితన్యవీచికలు అంతటానెలకొల్పి అందరిలో స్నేహభావాన్ని పెంచటం హరిదాసుల సంప్రదాయం.
బసవన్నల ఊరెగింపు: బసవన్నలకు దండం పేడటం వల్ల పశుసంరక్షణ కర్తవ్యం అందరికి భోదపడుతుంది. పశుసంరక్షణ తెలుసుకొని మాంసబక్షణ చేయరు.
భోగిమంటలు: భోగిమంటల వల్ల చెడు అని చెప్పబడే చలిని దూరంచేస్తారు. మనిషిలోని చెడుని కాల్చి మంచిని నింపాలి, అందుకు ముందుగా అంతటా వున్న చెడు భోగి మంటల్లో కాల్చివేయాలి.
పొంగలి: ఆవుపాలు శ్రేష్టమైన బెల్లంతో కొత్త బియ్యంతో, మట్టి కుండలో చేసి స్వీకరించటం ద్వారా చక్కటి ఆరోగ్యం అందరికి కలుగుతుంది. సంప్రదాయం వెనుక ఆనందమేకకుండా ఆరోగ్యం కూడావుంటుంది. ఇదియేమన సంస్కృతి విసిహ్టత.

Wednesday, October 12, 2016

                             "విశ్వకర్మ"

 విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా,సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొంటాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి. ఇది వేద విరుద్ధం. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించినంది. ఇతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.
 వరుస సంఖ్య వృత్తి చేయుపని
 1. కమ్మరి అయోకారుడు - ఇనుము పని
 2. సూత్రకారుడు(వడ్రంగి ) వర్ధకుడు - కొయ్య పని
 3. కాంస్యకారి (కంచరి) తామ్ర కారుడు - రాగి, కంచు, ఇత్తడి పని
 4. స్తపతి ( శిల్పి) శిల్ప కారుడు - రాతి పని
 5. స్వర్ణకారి స్వర్ణకారుడు - బంగారు పని


 విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు) చేయు వృత్తులు
 విరాట్ విశ్వకర్మ భగవానుడు (పంచముఖుడు) ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు వీరి ద్వారా చేయు శాస్త్రం మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి
 వరుస సంఖ్య మూలాఆధారం విశ్వకర్మ ముఖము మహర్షి / గోత్రరిషి శాస్త్రం వృత్తి ప్రోఫిషన్
 1. శివుడు మను సనగ బ్రహ్మర్షి తర్కం అయో శిల్పి - కమ్మరి బ్లాక్ స్మిత్
 2. విష్ణువు మయ సనాతన బ్రహ్మర్షి వ్యాకరణం దారు శిల్పి - వడ్రంగి/సూత్రకారుడు కార్పెంటర్
 3. బ్రహ్మ త్వష్ట అహభౌసన బ్రహ్మర్షి ధర్మశాస్త్రం తామ్ర శిల్పి - కాంస్య కారి - కంచరి brazier
 4. ఇంద్ర దైవజ్ఞ ప్రత్నస బ్రహ్మర్షి మీమాంస శిలా శిల్పి – స్తపతి (శిల్పి) స్టోన్ శిల్పకారుడు
 5. సూర్య విశ్వజ్ఞ సుపర్ణస బ్రహ్మర్షి వైధ్యం, జ్యోతిష్యం స్వర్ణ శిల్పి - స్వర్ణకారి గోల్డ్ స్మిత్

 వృత్తి
 పూర్వం వృత్తి సమాజంలోని ప్రజలకును, ప్రభూవులకును ఉపయోగానికి మరియు తమవిజ్ఞాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే విదానం, అవి క్రమేనా జీవనభృతి కొరకు చేపట్టే పనులు. ఈ వృత్తులు, ప్రజల మరియు ప్రభువుల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి. ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దం ఈ వృత్తులు.
 శిల్పం శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ, ఇవి ముఖ్యంగా మూడు విదాములుగా చెప్పవచ్చు.
 1. రాళ్ళాతో చేసిన శిల్పాలు ఇవి నల్ల రాళ్ళా తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులతో కూడిన కధలు, ఇతిహాసాలు, శాసనాలు, మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాలను గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభం అయింది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు. అంతే కాకుండా భూమిలోని ఖనిజ సంపద ద్వారా లభ్యమైన రాళ్లు ( వజ్రం, వైఢూర్యం, ముత్యం, పగడం, మొదలగు ) ఆభరణములకు ఇంపుగా పొదగడం ద్వారా నైపుణ్యము సంపాదించిరి.
 2. లోహక్రియ (Metalworking) లోహక్రియ అనేది విభిన్నమైన లోహాలతో పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ పనిముట్లు అవసరం ఉంటుంది. లోహక్రియ ఒక కళ, అలవాటు, పరిశ్రమ మరియు వ్యాపారం ఇది కంసాలీల పని. లోహసంగ్రహం, విజ్ఞానశాస్త్రం మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట ఆయుధాలుగా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను ఆభరణాలుగా మలిచేవారిని స్వర్ణకారి (బంగారుపనివాడు) (Goldsmith) అంటారు.
 3. కలపతో చేసినవి (Wooden works) కలపతో ఇండ్లకు కావలసిన ద్వారబంధములు, తలుపులేకాక భవన నిర్మాణాలు, దేవతా మూర్తులను, నగిషీలు (కార్వింగు), వివిద బొమ్మలు, పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం, వ్యవసాయానికి కావలసిన బండ్లు, నాగళ్లు, పనిముట్ల పిడి తయారుచేయడం, మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో కలపను ఉపయోగించడం ప్రారంభించారు.
 గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాల' కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరుగుతూంది.

 1. కమ్మరి : - పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము (అయో కారుడు). ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కొడవళ్ళ, కర్రు, పార, పలుగు, గునపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు, పరిశ్రమలు, పడవలు, ఫిరంగులు, కత్తులు ... ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ . ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 10వ కులంగా చెప్పబడుతున్న బయట కమ్మరులకు, విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులకు ఎటువంటి సంబంధమూ లేదు. షెడ్యూల్డు తెగలలోని కమ్మరులు దేశ దిమ్మరులు. విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులు ఆంధ్ర ప్రదేశ్ బి.సి కులాల జాబితాలో 21వ కులంగా నిర్ణయించబడి ఉన్నారు. ఉదా : - ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వఛ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు. ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే. తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు.ఆ ఇనుము యొక్క స్వఛ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.

 2. వడ్రంగి :- పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము వడ్రంగి కలపతో వస్తువులు తయారుచేయు వృత్తిపనివాడు. వడ్రంగి (దారు కారుడు) వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు, తలుపు, దార బంద్రం, పీట, మంచం.. మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టైన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిదీ...పిల్లలు ఆడుకున్నే బంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్ .

 3. కంచరి  :- పంచ వృత్తులలో ముడవ వృత్తి కంచరి (కాంస్యకారుడు) ప్రజలకు కావల్సిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని ఇత్తడిగా, రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.

 4. శిల్పి  :- శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు. ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్) అని అర్థం. దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారిపోయింది. శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నాడు మన భారత దేశం లో మనం చూస్తున్న విగ్రహాలు, అద్భుతమైన దేవాలయాలు, మహా మహా నిర్మాణాలు, వంతెనలు, శిలా శాసనాలు, అజంతా ఎల్లోరా గుహలు, కోటలు, మహల్ లు, చెరువులు, ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు. వీరినే 'స్థపతులు' అని అంటారు. జంతర్ మంతర్, నలందా విశ్వ విద్యాలయం, తాజ్ మహల్, చార్మినార్, మహా బలిపురం, తిరుపతి, శబరిమల, ఎర్రకోట, గోమఠేశ్వర, మధుర మీనాక్షి..... శిలా నిర్ణయం దగ్గర నుండీ విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండీ, స్థల పరీక్ష దగ్గర నుండీ, వాస్తు పూజ దగ్గర నుండీ, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు. భారత దేశానికి టూరిజం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే. వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని, రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.

 5. స్వర్ణకారి : - స్వర్ణకారుడు అంటే ముడి బంగారంను సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి, దాన్ని అనుభవ యోగ్యంగా, ఆభరణాలుగా, శిల్పాలుగా, పాత్రలుగా మార్చగలిగినవాడు...ఈ వ్యాసం వివిద పుస్తకాలనుండి మరికొన్ని వికీ పీడియాల నుండి సేకరించబడినది,

                  మునాసల అప్పలరాజు(బాబు)