ఇది నా ప్రపంచం. నా ప్రపంచం లోకి స్వాగతం

ప్రేమ.. వైరాగ్యాల ఉమర్ ఖయ్యామ్


ఇరాన్‌లోని ఒక చిన్న పట్టణం నిషాపూర్‌లో జన్మించిన ఉమర్ ఖయ్యామ్‌ను రుబాయీ చక్రవర్తిగా చె ప్పుకుంటారు. జీవన తత్వాలను పొదిగేందుకు రుబాయీ ప్రక్రియను వాడుకున్న తొలికవి ఉమర్ ఖయ్యామ్. 1857లో యూరప్‌కు చెందిన అభిమాని ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్, ఖయ్యామ్ రుబాయీలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత ఖయ్యామ్ రుబాయీల మాధుర్యం ప్రపంచమంతా వ్యాపించింది. 1048సంవత్సరంలో మే 18న జన్మించి 1131 దాకా తన రుబాయీలతో సాహిత్య లోకాన్ని ఉర్రూతలూపిన ఉమర్ ఖయాం జయంతి ఉత్సవాలుజరుగుతున్న సందర్భంగా .......


అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఘంటసాల గొంతులోంచి "అంత ము లేని ఈ భువన మంత పురాతన పాంథశాల...'' అన్న పద్యం జాలువారినప్పుడు తొలిసారిగా ఉమర్ ఖయామ్ పేరు తెలుగు జనసామాన్యం లోకి వెళ్లింది.
అలాగే ఓ ఇరవై ఏళ్ల క్రితం ప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ గొంతులో "హైరత్ మే హై ఊంచాయీ భీ గెహరాయీ భీ హై చారో తర ఫ్ బీడ్ భీ, తన్‌హాయీ భీ...'' అన్న ఖయ్యామ్ రుబాయీ ప్రతిధ్వనించినప్పుడు ఆ మాధుర్యంలో భరత ఖండమంతా పులకించిపోయింది.
http://images.exoticindiaart.com/batik/omar_khayyam_bc23.jpgప్రేమా? వైరాగ్యమా? సమాజంలోని అరిష్టాలన్నిటికీ అసలు కారణం ఏమిటీ అని ఒక సాధువును అడిగితే..." మనుషుల్లో వైరాగ్యం సన్నగ్లిలడమే అన్నింటికన్నా పెద్ద కారణం'' అంటూ కుండ బద్దలు కొట్టాడు. కాదా మరి? వైరాగ్యం అంటే సర్వ సంగ పరిత్యాగమని కాదు. జీవితపు క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడం. అలా జీవితం మీద భౌతిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలన్నీ ఈ జీవన సత్యాన్నే చాటిచెబుతుంటాయి. భౌతిక విషయాల క్షణికత్వం అర్థం కాకపోతే ఏమవుతుంది? అన్నీ తానే సొంతం చేసుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది. దోపిడీ, వంచనా పెరుగుతాయి. ద్రోహ చింతన, హింసాత్మక ధోరణి పెరుగుతాయి. పగలూ, ప్రతీకారాలతో మనుషులు
రాక్షసులవుతారు. ఇదే కదా జరిగేది? 
పైన ప్రస్తావించిన " అంతములేని ఈ భువనమంత'' అన్న పద్యం ఈ లోకం ఒక బాటసారుల సత్రమనే కదా చెబుతుంది. ఈ సత్రంలో సామాన్య జనం నుంచి రాజులు, చక్రవర్తుల దాకా ఎందరెందరో బసచేశారు. అక్కడ నాలుగు రోజులు గడిపి ఒక్కొక్కరే మళ్లీ అంతా ఎటో వె ళ్లిపోయారు. ఇప్పుడ అక్కడ ఎవరి ఆనవాళ్లూ లేవు అంటాడు ఖయ్యామ్.
http://www.exoticindiaart.com/details/panels/omar_khayyam_wd44.jpgసమాజంలోని అరిష్టాలన్నిటికీ అసలు కారణం ఏమిటీ అని ఒక సాధువును అడిగితే..." మనుషుల్లో వైరాగ్యం సన్నగ్లిలడమే అన్నింటికన్నా పెద్ద కారణం'' అంటూ కుండ బద్దలు కొట్టాడు. కాదా మరి? వైరాగ్యం అంటే సర్వ సంగ పరిత్యాగమని కాదు. జీవితపు క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడం. అలా జీవితం మీద భౌతిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలన్నీ ఈ జీవన సత్యాన్నే చాటిచెబుతుంటాయి. భౌతిక విషయాల క్షణికత్వం అర్థం కాకపోతే ఏమవుతుంది? అన్నీ తానే సొంతం చేసుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది. దోపిడీ, వంచనా పెరుగుతాయి. ద్రోహ చింతన, హింసాత్మక ధోరణి పెరుగుతాయి. పగలూ, ప్రతీకారాలతో మనుషులుhttp://iranpoliticsclub.net/history/scientists2/images/Omar%20khayyam%206%20Laleh%20Park,%20Tehran.jpg

ఏ కీర్తీ నిలవదు 
కీర్తి ప్రతిష్ఠలు రావాలనీ, సమస్త మానవాళికీ తన ప్రతాపమేమిటో తెలియాలనీ, అందరూ తన ముందు దాసోహం అంటూ నిలబడాలని ఎంతో మందికి మహా కోరిక. కానీ, అలా ఆశించిన వారంతా అంతిమంగా ఏమైపోయారు అంటూ, ''ఎందరెందరు చక్రవర్తులు వచ్చారో, ఎన్ని సామ్రాజ్యాల్ని జయించి పరిపాలించారో, ఎంత మహదైశ్వర్యాన్ని అనుభవించారో చూశాం. కానీ వారు వెంట తీసుకుపోయిందేమిటి? వారందరూ, ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు. వాళ్ల గురించి ఇప్పుడు ఎక్కడా ఏ ఆనవాళ్లూ లేవు'' అంటాడు.
అత్యంత సహజంగా జీవించడం మరిచిపోయి, మనుషులు అధికారం, ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారన్నది ఖయ్యామ్ వాదన. ఒక రుబాయీలో ఆ మాటే చెబుతూ... "మనుషుల పైన అధికారం చె లాయించే చక్రవర్తిత్వం కన్నా గొప్పది లేదనుకుంటారు కొందరు...ఈ లోకం కాదు, ఆ లోకంలో స్వర్గం సాధించడమే పరమావధి అని మరికొందరు... చేతుల్లో ఉన్నది వదులుకుని లేనిదేదో కావాలని
దానికోసం పరుగులు తీస్తారు. కానీ, ఎదుటే ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. '' అంటాడు. అయితే, మానవ వైఫల్యాలను మాత్రమే ప్రస్తావించి వదిలేయకుండా జ్ఞాన దిశగా నడిపించే ప్రయత్నం కూడా చేస్తాడు.
http://www.a-w-i-p.com/media/blogs/articles//omar_khayyam_rubiat_42.jpgఆనందమే మధువు
ఉమర్ ఖయ్యామ్ దృష్టిలో జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కలిగే ఆనందమే మధువు. ఆయనకు ఈ లోకం ఒక మధుశాల. ఈ క్రమంలోనే.. "ప్రియా! ఈ గ్లాసును మధువుతో నింపు!, గడిచిన వాటి గురించిన విచారాల్నీ, రేపటి గురించిన భయాల్నీ మనసులోంచి కడిగేసెయ్. ఈ నిమిషాన్ని, నిశ్చల నిర్విచార సమాధిలో నిలుపగల ఉజ్వల మధువుతో నింపు! ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.

రేపటికి నేను వేవేల ఏళ్లను కలిపేసుకున్న నిన్నలో కలిసిపోతానేమో ఎవరికి తెలుసు?'' అంటాడు ఖయ్యామ్. జీవితం పట్ల ప్రేమ, మరణాన్ని గురించిన వైరాగ్యం ఈ రెండూ ఖయ్యామ్ రుబాయీల్లో సమాంతరంగా సాగిపోతుంటాయి. జీవితానందం గురించిన ఆరాటం అందరిలోనూ ఉంటుంది. కానీ, మరణాన్ని గురించిన ధ్యాస మాత్రం ఏ కొందరిలోనో తప్ప ఉండదు. అందుకే పదే పదే ఆ స్పృహ కలిగించే దిశగా తన రుబాయీలను నడిపిస్తాడు.
http://www.seawaychina.com/productimages/-main/FIG-Omar-Khayyam-HN2247.jpgఅమృతత్వంలోకి... 
"కాలమూ, విధీ కూడబలుక్కుని తమలోని మధురసాన్నంతా వడగట్టి, నిగ్గదీసి, ఎందర్నో అపూర్వ సుందర ఉజ్వల వ్యక్తుల్ని సృష్టించాయి.వాళ్లలో కొందర్ని మనం ప్రేమించాం కూడా. వారంతా ఇప్పుడు ఏమైపోయారు? వారి వంతుకి ఒకటి రెండు గ్లాసుల మధువును సేవించి ఒక్కొక్కరే మృత్యువులోకి పాకి అదృశ్యమైపోయారు.'' అంటాడు. అలా అని అస్తమానం మరణం గురించే ఆలోచిస్తూ ఉండిపోవద్దంటాడు ఒక రుబాయీలో ...

"మనం మట్టిలోకి దిగి మట్టిగా మారిపోయాక, అక్కడ మధువూ ఉండదు, పాటా ఉండదు మనకు చేతనయిందల్లా, ఇప్పుడు మన ముందున్న కాలాన్ని అద్భుతంగా వినియోగించుకోవడం. నిజానికి మనం అంతకన్నా ఏం చెయ్యగలం? అందుకే ఈ క్షణంలో నిలిచి ఇంకే ఆలోచనలూ లేకుండా అమృతంలోకి ఐక్యమవుదాం.''అంటాడు
http://www.okonlife.com/images/saghism.jpgఈ క్షణమే సమస్తం 
గతంలోని చేదును గుర్తు చేసుకుంటూ కొందరు, భవిష్యత్తు గురించిన భయాలను తలుచుకుని కొందరు వర్తమానాన్ని జారవిడుచుకోవడాన్ని ప్రస్తావిస్తూ , నీ ముందున్న క్షణాల్ని ఆస్వాదించడానికే నీ జీవితం చాలదు. ఈ స్థితిలో గతం, భవిష్యత్తు మీదే గడిపే వారికి ఇక జీవితమేముంది? అంటూ ప్రశ్నిస్తాడు. " మన కాళ్ల కింది నుంచి కాలం ఎట్లా కొట్టుకుపోతోందో, ఎన్నిసార్లు చెప్పుకుని ఏం ప్రయోజనం?ఇంకా పుట్టని రేపూ, పుట్టి చచ్చిన నిన్న. వాటిని తలుచుకుని చిరాకు పడకు. ఈ రోజు హాయిగా తాగి అన్నీ మరిచిపోదాము. ఇప్పుడు అనే ఈ క్షణమే మిగిలింది మనకు'' అంటాడు.
http://fineartamerica.com/images-medium/rubaiyat-of-omar-khayyam-carl-purcell.jpg
అయితే ఎంత వర్తమానంలో తలమునకలై ఉన్నా మృత్యువు నిన్ను సమీపించకుండా ఉండదు. నిజానికి మృత్యువును సంపూర్ణంగా ఆమోదించే వాళ్లే జీవితాన్ని ఆమూలాగ్రం అనుభవిస్తారన్న భావననే ఖయ్యామ్ తన రుబాయీల్లో ఎక్కువగా పొదుగుతాడు. అందులో భాగంగానే "న దిపంచన రోజాపూలు నవ్వుతో పూసినంత కాలం కెంపు మధువును సేవించు. ఏనాడో నల్లని పానీయాన్ని పట్టుకుని మృత్యుదేవత నిన్ను సమీపించినప్పుడు దాన్నీ తాగు. జంకకు.'' అంటాడు.http://www.dollsofindia.com/dollsofindiaimages/sequin-art-paintings/omar-khayyam-and-saki-epitome-of-love-QQ01_l.jpg
వేళాకోళంగా... 
ప్రపంచ గమనంలో మానవ జీవితపు నిస్సహాయత గురించి కూడా కొన్ని బలమైన భావాలు ఉన్నాయి. ఈ విషయాలే చెబుతూ "ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో తెలీకుండానే ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఈ దిక్కుకు పోతున్నామనేది తెలియకుండానే నీళ్లకు మల్లే ఎటు కొట్టుకుపోతున్నామో పోతున్నాం.


అవును మరి! నన్ను అడక్కుండానే, నా ఇష్టం తెలుసుకోకుండానే ఎక్క్డడి నుంచో నన్ను ఇక్కడికి తోసేశారు. నన్ను అడగనైనా అడక్కుండా ఈలోకం నించిఎక్కడికిగెంటుతారోగెంటేస్తారుhttp://fineartamerica.com/images-medium/omar-khayyam-g-g-dere.jpg

ఈ దూర్తత్వాన్ని మరిపించేందుకు 


ప్రియా మధువు వంచు. '' అంటాడు. ఈ నిస్సహాయతల గురించి ఒక పక్క మాట్లాడుతూనే ఒక దశలో "నిన్ను ఈ లోకంలోకి ఈడ్చి తెచ్చి ఏది నిన్ను వేళాకోళం పట్టించిందో దాన్నే నువ్వు వేళాకోళం పట్టించు.'' అంటూ గడుసుతనాన్ని బయటపెడతాడు. ఏమైనా జీవన్మరణ తత్వాల్నీ, వాటిని ఆస్వాదించే వైనాన్నీ అద్భుతంగా చెప్పిన అరుదైన కవిగా ప్రపంచ సాహిత్యంలో ఉమర్ ఖయ్యామ్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనేది ఒక పరమ సత్యం.