సంపదలొసగే సంపత్ వినాయకుడు
సిద్ధిబుద్ధి వినాయకుడు, ఏకదంతుడు, లక్ష్మీగణపతిగా అందరికీ తెలిసిన వినాయకుడు సంపదలు కూడా ఇస్తానని చెప్పేందుకు వెలసిన అవతారమే సంపత్ వినాయగర్.(ఆంధ్రప్రదేశ్) లో విశాఖపట్నం జనమేగాక అనునిత్యం చుట్టుపక్కల ప్రాంతాలనుంచి అశేషంగా భక్తజనం వచ్చి స్వామివారిని కొలుచుకుంటుంటారు. అభిషేక ప్రియుడైన ఆ గజాననుడికి కోరికలు తెలియజేసు కుంటుంటారు. భక్తుల కొంగుబంగారంగా స్వామి ఇక్కడ విరాజిల్లుతున్నారు.
విశాఖ నగర నడిబొడ్డున వెలసిన శ్రీసంపత్ వినాయగర్ స్వామి భక్తుల నుండి అశేష పూజులందు కుంటున్నారు. ధూప దీప నైవేద్యాలతో, నిత్యపూజల తో ఆలయం కళకళలాడుతోంది. అభిషేక, అలంకారాలకు శ్రీసంపత్ వినా యగర్ స్వామి దేవాలయం ఏకైక ప్రత్యేకత. నగరంలో గణనాధుని ఆలయల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీసంపత్ వినాయగర్ దేవాలయం. భక్తుల పాప ప్రక్షాళనతో పాటు కొర్కేలు తీర్చే ప్రభువుగా గణనాధుడు ప్రసిద్ధికెక్కారు.
నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ (ఆశీలుమెట్ట) సమీపంలో... 1962లో ‘మెసర్స్ ఎస్‌జి సంబంధన్ అండ్ కో’ ఆవరణంలో స్వర్గీయ ఎస్‌జి సంబంధన్, టిఎస్ సెల్వగణేశన్ టి.ఎస్ రాజేశ్వరన్ కుటుంబ సభ్యులు శ్రీ సంప త్ వినాయగర్ స్వామివారి దేవాలయాన్ని స్థాపించారు.తమ వ్యాపార కార్యాలయం ఎదుట వాస్తుదోష నివారణార్థం నిర్మించారు. తదనంతరకాలంలో మత్స్యకారులద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమేణా వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలను కథలు... కథలుగా చెప్పుకునేవారు. దేవాలయం స్థాపించిన కొత్తలో సమీప జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవా రు. ఐదు సంవత్సరాలు తరు వాత కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ‘గణపతి యంత్రం’ స్థాపించారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో విశాఖను రక్షించమని శ్రీసంపత్ వినాయగర్ స్వామిని వేడుకున్నట్టు చరిత్ర చెబుతోంది.
సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే వేల్పుగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు సంపత్ వినాయగర్. విశాఖపట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈస్వామి ఆలయం దేశంలోనే ఇతర వినాయక ఆలయాల కన్నా చాలా చిన్నది... ప్రతిరోజూ దాదాపు అయిదువేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు.ఇలా సంపత్ వినాయగర్‌కు ప్రాచుర్యం లభించింది. 1971లో ఇండో...పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాక్ యుద్ధనౌకలు భారత సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినప్పుడు విశాఖను కాపాడాల్సిందిగా ప్రార్ధిస్తూ తూర్పునావికాదళం ఇన్‌చార్జి అడ్మిరల్ కృష్ణన్ సంపత్ వినాయగర్ ఆలయంలో 1,101 కొబ్బరికాయలను స్వామివిగ్రహం ముందు కొట్టారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పాకిస్తాన్ సబ్‌మెరైన్ పిఎన్‌ఎస్ ఘాజీ సముద్రజలాల్లో మన యుద్ధనౌకలపై దాడిచేసేందుకు వచ్చి బాంబులు అమర్చి తిరిగివెళ్తూ అవే బాంబులు పేలి సముద్రంలో మునిగిపోయింది. దీంతో విశాఖనగరానికి పెద్దప్రమాదం తప్పింది. ఇదంతా వినాయగర్ మహిమేనని భావించిన అడ్మిరల్ కృష్ణన్ తాను ఇక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజూ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.సంపత్ వినాయగర్ ఆలయంలో దర్శనానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరంలేదు.
ప్రముఖులు సైతం సాధారణ భక్తులతోపాటు వచ్చి స్వామిని దర్శించుకోవలసిందే... అభిషేకాలు, ప్రత్యేకపూజలకు మాత్రం రుసుము వసూలుచేస్తారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినవారు ముందుగా తమ వాహనాలను సంపత్ వినాయగర్ ఆలయానికి తీసుకువచ్చి పూజలుచేయించిన తర్వాతనే వాటిని వినియో గించడం ఆనవాయితీగా మారింది. ఉగాది, వినాయకచతుర్థి, పుత్రగణపయ్య వ్రతం, సంకటహర చతుర్థి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో ఎంతో విశేషంగా మహోత్సవాలు జరుగుతాయి. సంపత్ వినాయగర్‌ను దర్శించుకునేందుకు ద్వారకా బస్‌స్టేషన్‌లో( విశాఖపట్టణం ఆర్ టి సి కాంప్లెంక్స్ )లో దిగి కాలినడకన చేరుకోవచ్చు.
No comments:
Post a Comment