Saturday, August 30, 2014

సకల విఘ్నాలను హరించే మా ఇంట్లో వినాయక చవితి పూజ 

పం డుగల్లో ముఖ్యమైంది వినాయక చవితి పండుగ. ఈ పండుగ రోజున గణపతిని పరమ భక్తితో పూజిస్తారు. సృష్టికర్త విధాత దగ్గర నుంచి సామాన్య మానవుని వరకు అందరూ సకల విఘ్నాలను హరించే విఘ్నాధిపతైన గణేశుని పూజిస్తారు. ఏ శుభకార్యమైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు వినాయక పూజతో ప్రారంభమవుతాయి. ప్రతి పనిలో ప్రారంభంలో


 
పూజలు పొందేది ఈ దేవుడే. వినాయకుని భక్తితో 21 పత్రులతోను, 21 రకాల పిండి వంటలతో పూజించిన తర్వాత ఆ రోజు సాయింత్రం,లేదా మూడు రోజులు,ఏడు,తొమ్మిది రోజులు ఇలా వాల్ల ఓపికను బట్టి దగ్గర్లో ఉన్న  భావి, చెరువు, లేక నది నీళ్ళలో నిమజ్జనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
వినాయకుడిని ఏకదంతుడు,గజరూపుడు, మూషిక వాహనుడు, లంబోదరుడు అనేక పేర్లతో పిలుస్తారు. గణేశ తత్వంలో ఎన్నో విశేషాలున్నాయి. పార్వతీ దేవి మంగళ శుభప్రదమైన పసుపు ముద్దతో గణపతిని తయారు చేసింది. 
గణపతి జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదిస్తారని ప్రతీతి. విశ్వామిత్రముని దమయంతీ భర్త నలుడుకి వినాయక వ్రతం గురించి తెలిపారు. కృష్ణుడు ఈ వ్రతమాచరించి జాంబవంతుడి నుంచి శమంతక మణితోపాటు జాంబవతిని భార్యగా పొందాడు. వృత్తాసురుని వధించేటప్పుడు ఇంద్రుడు, రావణుడు కొనిపోయిన సీతను వెతికేటప్పుడు రాముడు, ఆకాశం నుంచి గంగను తెచ్చేటప్పుడు భగీరధుడు వినాయక వ్రతం ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 
సృష్టిలో మొదటి శబ్ధమైన ఓం కారమైన ప్రణవనాదంతో ఆయన రూపం పోలిక కలిగి ఉందని వేదాలు, ఉపనిషత్తులు ఈ అభిప్రాయం గురించి ప్రస్తావించాయి. ఏనుగు సూక్ష్మ బుద్దికి ప్రతీక. అందుచేత జ్ఞాన ప్రదాతైన గణేశుని ఏనుగు తలతో పూజిండం అతని నాలుగు చేతులు మానవులకు సహాయం చేయడంలో గొప్పశక్తిని సూచిస్తాయి. 
విద్యారంభానికి సైతం గణేశుడే దైవతం. బాధ్రపద శుద్ద చవితినాడు గణేశుని పూజిం చడంలో అనేక ప్రత్యేకతలున్నాయి. గణేశుడు సృష్టికి శ్రీకారం, ఓంకారం. సృష్టి ఓంకార రూపంలోఆవిర్భవించింది. ఓంకార స్వరూపుడుగా గణపతిని ప్రస్తుతిస్తూ వేదాల్లో “”గణానంత్వ గణపతిగం హావామహే’అని స్తుతించబడింది. గణపతి పూజవల్ల జ్ఞానం, బుద్ధి, ఐశ్వర్యం లభిస్తాయనేది ప్రతీతి.

No comments:

Post a Comment