కేరళ రాష్ట్రం పేరు వినగానే మొదటగా మీకు గుర్తుకు వచ్చేవి బ్యాక్ వాటర్స్ మరియు హౌస్ బోటులు. కేరళ రాష్ట్ర టూరిజం లో మూడు వంతుల మంది పర్యాటకులు హౌస్ బోటులు ప్రయాణాలకే మొగ్గుచోపుతారు,ప్రత్యేకంగా బ్యాక్ వాటర్స్ కొరకే వెళతారు. దేశంలోని పర్యాటకులే కాక, ఇతర దేశాలనుండి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆనందించి వెళతారు. ఈ రకంగా కేరళ దేశీయులకు, విదేశీయులకు ఒక సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. కేరళలో ఈ కెనాల్స్ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణిస్తూ ట్రావెల్లెర్ లకు గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ అందాలు చూపుతున్నాయి. ఇంతవరకూ కేరళలోని బ్యాక్ వాటర్స్, హౌస్ బోటు లు చూడని వారి కోసం ఈ కథనం తో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మంచి మార్గదర్శకత కాగలదని వివరిస్తున్నాం.
హౌస్ బోటు ... అధ్బుత ఆనందాలు మనల్ని మైమరిపిస్తాయి...అల్లెప్పి బ్యాక్ వాటర్ టూర్స్ కు ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలలో అల్లెప్పి ఒకటి. ఇక్కడ మీరు ఒక రోజు బోటు విహారం లేదా ఓవర్ నైట్ స్టే కొరకు ఒక పేకేజ్ తీసుకోవచ్చు. బ్యాక్ వాటర్ టూర్స్ చాలావరకు అల్లెప్పి నుండి మొదలవుతాయి.
తాజా అనుభూతుల అల్లెప్పి ఇక్కడ గల హౌస్ బోటు లలో కొద్ది గంటలు గడిపితే చాలు ఎంతో రిఫ్రెష్ అయిపోతారు. చల్లటి నీటి గాలులలో ప్రకృతి అందాల మధ్య అద్భుత ఆనందాలు అనుభవించగలరు.
ప్రయాణం ఇక్కడి బోటు ప్రయాణాలు పున్నమడ లేక్ నుండి మొదలవుతాయి. ఇక్కడే ప్రసిద్ధ నెహ్రు ట్రోఫీ స్నేక్ బోటు రేస్ కూడా జరుగుతుంది. అల్లెప్పి నుండి చాలా ఇతర రూట్ లు కూడా కలవు.
అల్లెప్పి నుండి అల్లెప్పి ఈ విహారాలలో అధికంగా అల్లెప్పి నుండి అల్లెప్పి వరకు పేకేజ్ లు వుంటాయి. దీనిలో హౌస్ బోటు లో ఓవర్ నైట్ స్టే కూడా వుంటుంది. బోటు పున్నమడ లేక్ నుండి దాటి రాత్రి అంతా వత్తకాయాల్ లేక్ వద్ద వుండి మరుసటి రోజు ఉదయానికి వెనక్కు తిరిగి అల్లెప్పి చేరుతుంది.
అల్లెప్పి నుండి కుమరకోమ్ అల్లెప్పి బ్యాక్ వాటర్స్ నుండి, మరొక అందమైన ప్రదేశం కుమరకోమ్ వరకు ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ లో ప్రయాణం ఆహ్లాదం కలిగిస్తుంది. చక్కని ప్రకృతి, వీనుల విందైన గాలుల సంగీతం కల ఈ విహారం మీకు లైఫ్ లో ఒకేసారి కలిగే అనుభూతిగా వుంటుంది.
పక్షుల కిల కిల ధ్వనులు మీకు పక్షుల పట్ల ఆసక్తి కలిగి వుంటే, మీరు తప్పక అల్లెప్పి నుండి కుమరకోమ్ కు బ్యాక్ వాటర్స్ లో ప్రయానిన్చాల్సిందే. మీ జర్నీ అంతా దోవలో ఎన్నో రకాల, స్థానిక మరియు వలస పక్షులు కనపడతాయి.
అల్లెప్పి నుండి కొట్టాయం బ్యాక్ వాటర్ విహారంలో మీరు అల్లెప్పి నుండి కొట్టాయం కూడా ప్రయాణించ వచ్చు. ఈ రూట్ లో మీరు తాటి చెట్లు, వాటి పై నుండి కల్లు తీసి జీవనం సాగించే వారిని చూస్తారు.
అల్లెప్పి నుండి తొత్తప్పల్లీ బహుశా తొత్తప్పల్లీ గురించి మీరు ఎక్కువగా విని వుండరు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం. ఇక్కడ గల వరి పొలాలు, కొబ్బరి తోటలతో తొత్తప్పల్లీ ఒక స్వర్గం లా వుంటుంది. మీ బోటు విహారం లోని ఈ రూట్ లో మీరు ఇతర ఆకర్షణలు అయిన అమ్బలపుజ్జ టెంపుల్ , చంపక్కులం చర్చి, వెంబనాడ్ లేక్ మరియు పతిరమనల్ వంటివి చూడవచ్చు.
అల్లెప్పి నుండి మంకొట్ట ఈ జర్నీ మరో మారు మిమ్మల్ని పున్నమడ లేక్ నుండి తీసుకు వెళుతుంది. మంకొట్ట ఒక చిన్న గ్రామం. ఇక్కడి ప్రజలు పీచు తయారీ పరిశ్రమలతో జీవనం సాగిస్తారు.
అల్లెప్పి నుండి అలుమ్కదావు అలుమ్కదావు లో బోటు తయారీ పరిశ్రమ కలదు. ఇక్కడ మీరు తిరిగే హౌస్ బోటు లు అలుమ్కడవు లో తయారు అవుతాయి. ఈ ప్రదేశం పర్యటన ఒక గొప్ప అనుభూతి కాగలదు. బోటు ల తయారీ, అక్కడి ప్రజల జీవన విధానం అద్భుతంగా వుంటాయి.
అసలు సిసలైన కేరళ భోజనం కేరళ భోజనం ఎంతో రుచికరంగా వుంటుంది. సాధారణంగా అనేక మార్లు ఈ హౌస్ బోటు లకు వచ్చేవారు, కేరళ వంటకాలు అమితంగా ఇష్టపడే వారే. హౌస్ బోటు లోనే ఈ వంటకాలను వంటవారు తయారు చేస్తారు. మీరు ముందుగా వారికి ఏ డిష్ కావాలో, ఎలా కావాలో చెపితే, మీ ఛాయస్ మేరకు వారు దానిని తయారు చేస్తారు.
కేరళ ప్రజల ఆతిధ్యం కేరళ లో హౌస్ బోటు టూర్లను నిర్వహించేందుకు అనేక ఏజెన్సీ లు కలవు. ఇక్కడ ఏజెన్సీలు వారు స్నేహ పూరిత సంభాషణలు. వీరితో వ్యవహరిస్తూ వుంటే, మీరు మీ హోం టవున్ లో ఉన్నట్లే వుంటుంది. మీరు అన్నీ మరచి పచ్చని ప్రకృతి ఒడిలో విశ్రాంతి పొందవచ్చు.
good
ReplyDelete