మాతృ మూర్తి సంకల్పం
అవి ముస్లిం రాజులు పరిపాలిస్తున్న రోజులు, ఒక రోజు పన్నెండు సం. రాల అమ్మాయి దారి వెంట నడుచుకుంటూ ఒక సంఘటన చూసింది, కొందరు దుండగులుదారి వెంట వెళ్ళే అమ్మాయిలను ఏడిపిస్తున్నారు. వెంటనే ఇంటికి వెళ్లి, నాన్న గారికి చెప్పింది. ఆ అమ్మాయి నాన్న ఎవరికీ చెప్పకు ఆ విషయం మరిచి పోఅన్నాడు. అలా నాలుగు సం. రాల తరువాత, ఈ అమ్మాయినే బాగా అల్లరిపెట్టి ఏడిపించారు, మల్లీ ఆమె నాన్న దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి, మీరు రాజుగారి వద్దనే పని చేస్తున్నారు కదా, ఆ దుండగులకు శిక్ష పడే విధంగా చెయ్యండి అంది. నేను ఏమి చెయ్యలేనమ్మా, ఎందుకంటే వారు రాజుగారికి దగ్గరి వారుఅన్న్నారు. కొన్ని సం. రాల తరువాత ఆ అమ్మాయికి వివాహం అయ్యింది.
ఒక రోజు ఆ మహిళా గుడికి వెళ్లి పూజలు చేస్తుంటే ముస్లిం దుండగులు వచ్చి శివాలయం లో విగ్రహాలు పగుల గొట్టి, గోవులను చంపి. గోవు రక్తాన్ని శివలింగం మిద పోశారు, కొంత మంది మహిళలను ఎత్తుకెళ్ళారు. వెంటనే ఆ మహిళా తన భర్తకు జరిగిన విషయం చెప్పి, ఏదో ఒకటి చెయ్యాలి లేకుంటే ఇలా ఎన్నోదారుణాలు జరుగుతాయి, ఎంతో మంది మహిళల మాన, ప్రాణాలను బలి తిఇసుకుంటారు, హిందూ దేవాలయాలను నాశనం చేస్తారు అని చెప్పింది. వెంటనే తనభర్త, ఆ విషయాలు నీకెందుకు జరిగేది జరుగుతుంది. నీ పని నేవ్వు చేసుకో అన్నాడు. ఆమె చిన్న నాటి నుండి జరిగిన విషయాలను గుర్తుకు చేసుకొని, ఏమి చేయలేని సొంత తండ్రి, అసమర్ధత భర్త.......? తనకే ఇలా అయితే సమాజం లో మిగిలిన మహిళల పరిస్తితి, ఏమిటి అని మనసులో బాగా ఆవేదన, భాద రగులుతుంది.
కోన్నిరోజుల తరువాత ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకొని తన కోడికుని వీర వ్రతునిగా తయారు చేసి, ఈ ముస్లిం పరిపాలనకు ముగింపు ఇచ్చేవాడిగా మరియు హిందూ సామ్రాజ్య స్తాపకుడిగా తయారు చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆప్పటి నుండి తన కుమారునికి ధైర్యానికి సంబంధించిన కథలను, సంఘటనలను చెప్పి, నాలుగు, అయిదు సం. రాల వయస్సు లో ఒక గురువు దగ్గర యుద్ధం నేర్చుకోవడానికి చేర్పిస్తుంది. ఆ విదంగా అతడు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొని ముస్లిం రాజులతో యుద్ధం చేసి వారిని అంతం చేసి, హిందూ సామ్రాజ్యాన్ని సాధించాడు. తన మాతృ మూర్తి సంకల్పాన్ని నెరవేర్చాడు, ఆ మాతృముర్తియే జిజీయా మాత, ఆమె కుమారుడు-హిందూ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్.
No comments:
Post a Comment