Thursday, June 26, 2014

Kota diu

రాజ్ గడ్ ట్రెక్కింగ్ లో ....నా అనుభవం...!!!


                     రాజ్ గడ్ ట్రెక్కింగ్లో....నా అనుభవం...!!!

  రాజ్ గఢ్ మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఒక అందమైన పర్వత కోట. చత్రపతి శివాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన మరాఠా సామ్రాజ్యంలో రాజుగా పట్టాభిషేకం సమయంలో 1674 లో తన రాజధాని ఫోర్ట్ రాగ్ గడ్ ను ప్రకటించుకున్నారు.రాజ్ గఢ్ మహారాష్ట్ర రాష్ట్రం పశ్చిమ దక్షిణ భాగంలలో ఉంది
. భారతదేశం పశ్చిమ తీరంలో మరియు అరేబియా సముద్రం ఒడ్డున రాజ్ గడ్ సహ్యాద్రి పరిధి పడమటి కనుమలలో ఒక పశ్చిమ భాగంలోని ఉంది. జిల్లా ఉత్తరాన థానే జిల్లా, తూర్పున పూనే జిల్లాలో, దక్షిణాన రత్నగిరి జిల్లాలో, మరియు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంగా ముంబై హార్బర్ కలిగి ఉంది. రాయ్ గఢ్ మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఒక అందమైన పర్వత కోట.ప్రాంతం చారిత్రక కట్టడాల పర్యాటకులు అనేక ఇష్టమైన హాట్ స్పాట్ నింపుతారు. ఒక ప్రముఖ పర్వతారోహణ పాయింట్ కాకుండా అది కూడా సాహసోపేత పర్యాటక కేంద్రంగా ఉంది. ఒక కొండ భూభాగం మరియు సహజ ఆకులను అలంకరించబడిన రాజ్ గడ్ ఆసం అందం పర్యాటక రంగంలో ఒక ప్రముఖ స్థానంలో పొందుతాది.ఇక్కడ ప్రశాంతత స్థలాకృతి ఖచ్చితంగా బిజీ జీవితం నుండి వచ్చే వారికి మాత్రం ఓదార్పు ఉంది.

   పర్యాటకం లో భాగంగా ప్రతి సంవత్సరం మా మిత్రుడు కోట్ల మహక్ష్మీనాయ్డు నేను అనగా మునాసల అప్పలరాజు(బాబు)మరికొంతమంది మిత్రులుతో గత ఐదారు సంవత్సరాలుగా తీర్థయాత్రలు పేరుతో జ్యోతిర్లింగాల పేరుతో పన్నేండు జ్యోతిర్లింగాలకి పదునొకటి(11)జ్యోతిర్లింగాల దివ్యదర్శనం చేసుకున్నము.దీనిలో భాగంగానే గత సంవత్సరం 2013లో...మహారాష్ట్రం పరిప్రాతంలలో గల భీమశంకరజ్యోతిర్లింగం, వైధ్యనాదేశ్వరజ్యోతిర్లింగం,త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగములను దర్శించుకున్నాము,అయితే ప్రతి సంవత్సరం వెల్తున్న మా ఇద్దరు మిత్రులం తప్పా కొత్తగా మాతో మరో ముగ్గురో నలుగురో జతకట్టి ఇప్పటివరకూ వస్తున్నారు,దీనిలోని బాగమే రాజ్ గడ్ ట్రెక్కింగ్ కు ఆవకాశం కుదిరింది, ఈ రాజ్ గడ్ ట్రెక్కింగ్ ప్రయాణలో.........
   మొదటి రోజు  ట్రెక్‌లో కావలసిన డ్రై ఫ్రూట్స్, మరిన్న బలమైన ఆహార పదార్థాలు తీసుకొని పూణే వెళ్ళాం.ఆ మరుసటి  రోజు తెల్లారుజామునే రెండు మోటర్ బైక్స్ అక్కడున్న మా మిత్రుల దగ్గర తీసుకొని  నలుగురం కలసి పూణే, బెంగళూరు హైవే దారిపట్టాం. ఓ 20 కిలోమీటర్లు ప్రయాణించాక హైవే నుండి కుడివైపుకు తిరిగి మరో 20 కిలోమీటర్లు ఖేడ్‌శివపూర్ మీదుగా  గుంజావనే అనే చిన్న గ్రామానికి చేరుకొన్నాం, అక్కడే మా బైక్స్ పార్క్ చేసాం. అక్కడ నుండే ట్రెక్ మొదలయింది. ఆ రోజు మా అద్రుస్టంకొద్ది చాలా మంది ట్రెక్కర్స్ వచ్చారు, అందులో కుటుంబాలు కూడ వున్నాయి, ఆడ,మగ అంటు తేడా లేదు..పది పదిహేనేళ్ల వయసున్న పిల్లలు కూడ వున్నారు.
     ఇక ఈ రాజ్‌గడ్ చరిత్ర గురించి చెప్పడానికి అక్కడ ఎవరూ గైడ్స్ కానరాలేదు, కాస్త అంతర్జాలంలో వెదికితే కొన్ని విషయాలు దొరికాయి. ఈ కొండలున్న ప్రాంతాన్ని దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం కనుగొన్నారు., అక్కడ  విశ్వామిత్ర మహర్షి  నివసించినట్లు  చెబుతున్నారు.  తర్వాతెప్పుడో  అనగా 1490 లో నిజాం షాహి కాలంలో అహమద్ బహిరి ఈ రాజ్‌గడ్‌ని నిర్మించి "మురంబదేవ్" అని పిలిచేవారట! ఈ కోట  దాదాపుగా వీరి పరిపాలనలో 120 ఏళ్ళ పాటు వున్నదంటున్నారు.
    తర్వాత ఎప్పుడో  చత్రపతి శివాజి తండ్రి అయిన షహాజి రాజే బొన్సాలే పరిపాలనలో మొగల్ రాజుల వలన కొన్నియుద్దాలు జరిగాయట, కోటను వదులుకోవడం, మళ్ళీ స్వాదీనం చేసుకోవడం జరిగిందని చెప్పుతున్నారు.చత్రపతి శివాజి పరిపాలన కిందకు వచ్చాక ఆయన పరిపాలనలో మూడు వైపుల వున్న కొండల మీదుగా "కర్టన్ వాల్" లాగ కోటను నిర్మించి విస్తృత  పరిచి ఈ కోటకు "రాజ్‌గడ్" అని పేరు పెట్టారట. 1672లో శివాజి రాజే తన పరిపాలన కేంద్రాన్ని రాయిగడ్ కు  మార్చుకొన్నారు. శివాజి తదనంతరం ఆయన కుమారుడైన శంబజి రాజే పరిపాలన లో  మరాఠా రాజుల పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు.  తర్వాత మళ్లీ మొఘల్  రాజులు దాడులు చేసి యుద్దాలు జరిగిన సమయంలో శంబజి రాజే  మరణించారు. దానితో  మొగల్స్ అధీనంలోకి  మొత్తం మరాఠా రాష్ట్రమంతా పూర్తిగా  చేరిపోయింది.
     మా ట్రెక్ ప్రారంభమయిన గంటకు నా అనారోగ్యం ప్రభావం కనిపించింది.! ఒక యాభై  అడుగులు వేయగానే ఆయాసంతో కాసేపు నిలబడాల్సి వచ్చింది.  అప్పుడు ఒక్క క్షణం అనిపించింది ..మొండిగా ట్రెక్కింగ్‌కు వచ్చినందుకు బాగానే తగిన శాస్తి జరిగిందన్న భాద మనసులో మదిలింది.!
      అక్కడ వాతావరణం గంటకో సారి మారుతూ వున్నది, కాసేపు మంచుతో కూడిన మేఘాలు కమ్ముకొంటున్నాయి . మళ్ళీ కాసేపటికి మాయం అవుతూ ..దోబూచులాడుతున్నాయి..! వర్షాకాలం ముగిసే  సమయంలో అక్కడ ట్రెక్ చేయడం బాగుంటుంది..బాగా ఆకుపచ్చదనంతో..భూమంతా పరుచుకొని వున్నట్లుంటుంది, కాని మా ట్రెక్ అప్పటికే..వర్షాకాలం దాటి చాన్నాళ్లు అవడం మూలాన అప్పుడప్పుడే ఆకు పచ్చదనం నుండి మెల్లగా లేత పసుపు, ఆరంజి రంగులోకి మారుతున్నది! అది కూడా ఒక రకమైన సౌందర్య భరితంగానే  కనిపించింది.
     చాలా మంది ట్రెక్కర్స్ మా లాగానే  ఆ కొండను ఎక్కుతున్నారు. మరికొందరు దిగుతూ మాకు ఎదురవుతున్నారు..వారంతా రాత్రి పైన కోటలోనే బస చేసి ఉదయమే కొండను దిగుతున్నారు. ఒక్కో చోట చాలా ఏటవాలుగా వుంటున్నది..అక్కడ మాత్రం కాస్త కష్ట పడాల్సి వస్తున్నది. ఎటు చూసినా...ఆకుపచ్చని దుప్పటి కప్పుకొన్నట్లు కనపడుతున్నది, అక్కడక్కడ ఆ ఆకుపచ్చ దుప్పటి మడతలు  పడినట్లుగా కొండ వొంపులు కనపడుతున్నాయి. దాదాపుగా రెండు గంటలు తర్వాత ఒక పెద్ద రాతి కొండ మీదున్న కోట గోడను  అతి కష్టంతో చేరుకొన్నాము. ఆ  ప్రదేశం చాలా ఏటవాలుగా వున్నది, అక్కడున్న కొన్ని ఇనుప కడ్డీల  ఆధారం తో  ఎక్కగలిగాము.అదైనా చాలా ప్రమాదంతో కూడుకున్న పనే!..కాస్త పట్టు జారినా అంతే..ఏకంగా కొన్ని వేల అడుగుల కిందకు పడిపోవడమే....!! . ఆ కోట గోడ దాటి లోపలికి వెళ్లగానే పద్మావతి కొలను కనపడుతుంది. అంత ఎత్తైన కొండ మీద చాలా పెద్ద కొలను నిర్మించారు చత్రపతి శివాజి. అది కూడా పచ్చదనం మద్యలో వున్నది. దాని చుట్టు పడిపోయిన భవనం మొండి గోడలు కనపడుతున్నయి.
    అక్కడ నుండి కాస్త పైకి వెళ్లాక అక్కడ చాలా విశాలమైన పద్మావతి దేవాలయం వున్నది. కాని అందులొ దేవాతా విగ్రహాలు కనిపించాయి.ట్రెక్కర్స్ అందరూ అందులో విశ్రాంతి తీసుకొంటున్నారు. రాత్రి అక్కడే బస చేయాలనుకొనే వారు ఆ ఆలయాన్ని వసతి గృహంగా వాడుకొంటున్నారు. ఆ దేవాలయానికి  కుడివైపున ఒక పెద్ద బావి వున్నది. ఆ నీటినే  అక్కడి వారు మంచి నీరుగా వాడుకొంటున్నారు. అక్కడ ఒక చిన్న సైజు హోటలు వున్నది. అక్కడకొచ్చే ట్రెక్కర్స్ అందరు అక్కడే భోజనాలు చేస్తుంటారు.
   అప్పటికి  సమయం పది అయ్యింది. మధ్యాహ్నానికి   మేము కూడ మా నలుగురికి భోజనాలు  ఆర్డర్ ఇచ్చి అక్కడ నుండి మళ్లీ మా ట్రెక్ మొదలు పెట్టాం, అక్కడ నుండి మూడు దారులుగా చీలిపోతుంది.  మొదటగా ఎదురుగా వున్న రాతితో నిర్మించిన తాపల మీదుగా పైకి చేరుకొన్నాం అక్కడికి, దాదాపుగా 4514 అడుగులు ఎత్తు వున్నట్లు అక్కడ సమాచారం ఉంది. అక్కడకు పెద్ద రాతి ద్వారం గుండా  చేరుకోవాలి, అక్కడే శివాజి  సేనాపతి, మంత్రులు అయిన  తానాజీ, యశాజి, షంబర్ బట్ ల నివాస గృహాలు శిధిలమై వున్నాయి. అక్కడ కూడ 15 అడుగుల వ్యాసంతో  వున్న చిన్న కొలను  వున్నది.
     అక్కడ నుండి మధ్యాహ్నం  భోజన సమయానికల్లా  కిందకు వచ్చి  మా భోజనాలు చేసాక..కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ  కుడి వైపున వున్న మరో దారి వెంట వెళ్లాం..!  అక్కడ నల్లని రాతితో నిర్మించిన కోట ముఖ ద్వారం వున్నది. అక్కడ నుండితిరిగి వెనక్కి వచ్చి..మూడో రహదారి వెంట నడిచాం.., ఈ దారిలో ఏ కాస్త ఏమరపాటున నడిచినా అంతే...  ఏకంగా ఎక్కడికో.. వేల అడుగుల కింద వున్న అడవిలోకి  జారి పడి పోవడమే!! .అంత ప్రమాద కరమైన దారే కాని..సాహసికులకు మాత్రం మంచి థ్రిల్ ఇస్తుంది.  విచిత్రమేమిటంటే ఈ కోటకు మూడువైపుల గోడ లాగ కొండలున్నాయి. వాటి మీద కోట గోడలు కట్టారు..వాటివలన కోటకు ఎటువంటి ఉపయోగం లేదు.  ఈ మూడు కొండలు ఒక చోట కలుస్తాయి అక్కడ మాత్రమే కోట వున్నది..మరెందుకు ఈ కొండల మీద కర్టన్ లాగ కోటలు కట్టారో అర్థం కాదు. అసలు అక్కడికి చేరడానికి ఎన్నో ప్రయాస కోర్చి, ఎన్నో కష్టాలు పడ్డాం..! అటువంటి చోటకు ఎలా అంతంత పెద్ద పెద్ద రాళ్లు ఎలా మోసుకెళ్లారో ఆలోచిస్తే, ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. .ఎక్కడా కూడ నడవదగ్గ రహదారి లేనేలేదు..!  ఎంతో కష్ట పడి ఎక్కాల్సిందే..పైకి. ఎంత కష్ట పడ్డారోఅనిపిస్తుంది . ఎంతమంది మనుషుల శ్రమతో ఈ కోట తయారైందో!!
       అక్కడ నుండి సాయింత్రం అవుతుండగా కిందకు దిగడం మొదలుపెట్టాం, సాయింత్రానికల్లా గుంజావనే గ్రామం చేరుకొని అక్కడి నుండి మరో రోజు ఉదయం మరో వైపు నుండి ఈ కోటను చేరడానికి కొండ ఎక్కాలని మా ఉద్దేశం, అందుకోసం చాలా వేగంగా దిగుతున్నాం.  పై నుండి వర్షపు దారలు వలన ఏర్పడిన చిన్న చిన్న కాలువలు వున్నాయి వాటికి అటు ఇటుగా మట్టి గోడలు వున్నాయి..!
  సాయంత్రానికి మరలా తిరిగి  గుంజావనే చేరుకొన్నాం. మేము బాగా అలసిపోయిఉన్నాము.మనం జీవితంలో మళ్లీ తిరిగి ఇలాంటి ట్రెక్ చేయగలమా" అన్న ఆలోచన అందరిలోని ఒకేసారి కలిగింది. ఈ ట్రెక్ గురించి వివరించడం తో చాలా సులభంగానే అనిపిస్తుంది.ఈ ట్రెక్ చాలా కష్టపడాల్సి వచ్చింది నా అనుబవం ప్రకారం ప్రమాధంతో కూడుకున్న ట్రెక్ గా బావిస్తున్నాను,
    చివరగా  తోర్నా ప్రాంతం వెల్దామన్నారు,నేను రాను అని మొండికేయడంతో విరమించుకున్నాము.తోర్నా ప్రాంతం నుండి ట్రెక్ చాలా సాహసంతో కూడుకున్నదని కొదరన్నారు, ఇక్కడ ప్రకృతి రమణీయ దృశ్యాలు చాలా వున్నాయని విన్నాను ..కొన్ని ఫోటోస్ కూడ చూసాను..అవి చూసినప్పటి నుండి ఒకటే ఉబలాటం నాలోపల..ఎలగైనా అటు వైపు నుండి ట్రెక్ చేయాలని.  మా ఫ్రెండ్స్ ముగ్గురూరు తటపటాయించారు, మనసులో చాలా దృడంగా అక్కడీకి వెళ్లాలని వున్నా... నా అభిప్రాయానికి అందరూ తలూపి.....ఇంటి ప్రయాణం సాగించాం.
    
మన భారతదేశం లో  మహారాష్ట్ర రాష్ట్ర పూనే జిల్లా కోటలలో ఒకటి రాజ్ గడ్ కోట 1318 మీటర్ల సముద్ర మట్టం. గతంలో "మురుమ్ దేవ్" అని పిలిచేవారు, ఇది మరాఠా సామ్రాజ్య రాజధానిగా  రాయ్ గఢ్ ఫోర్ట్ రాజధాని,  దాదాపు 26 సంవత్సరాలు చత్రపతి శివాజీ మహారాజ్ పాలనా కాలంలో. ఈ కొండను పటిష్టం చేసి ఉపయోగించారు. ఈ కోటను ముట్టడించడం, ఎవరితరంకాదు, ఈ. కోటలో అత్యధిక భాగం రాజభవనాలు, నీటి తొట్టెలు ఉన్నాయి. మరియు గుహల అవశేషాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి.ఈ కోట శివాజీ కుమారుడు రాజారాం, శివాజీ క్వీన్ సాయిబాయి, ఆగ్రా నుండి శివాజీ తిరిగి, బల్లకిల్లా, సోనోపంత్ కఠినమైన పదాల మహాదర్వాజ్ గోడలలో అఫ్జల్ ఖాన్ తల ఖననం మరణం పుట్టిన అనేక చారిత్రక సంఘటనలున్నాయి, మా డంతో శివాజీ, మరియు ఖందోజి ఖోపాడే భాగం.ఈ కోట కూడా మొఘల్ దళాలకు నాయకత్వం చేసిన 1665 లో రాజపుత్ర రాజు జైసింగ్ తో పురందర్ సంధి (1665) కుదుర్చుకోవడం శివాజీ ఉండేందుకు 12 కోటలలో ఒకటిగా ఉంది. 22 ఇతర కోటలు ఇక్కడున్నాయి,




Saturday, May 24, 2014

ఎల్లోరా గుహలు...

రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సు లో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు. ఎల్లోరా గ్రామము మహారాష్ట్ర లో ఔరంగాబాద్ కు 30 కి.మి. (18.6 మైళ్ళు) దూరము లో ఉన్నది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ది చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. (12బౌద్ద గుహలు - నిర్మాణం -600-800 బి.సి.),

 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి.(17 హిందూ గుహలు -నిర్మాణం - 600-900 బి.సి.), 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. (5 జైన్ గుహలు - నిర్మాణం - 800-1000 బి.సి.) పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చూపిస్తున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.

ఇందులో భౌద్ద ఛైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరా ని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగష్టు-అక్టోబర్ మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.
మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయిందట. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారట. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారట.ఎల్లోరా గుహలన్నింటి లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభా లపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే, దీనిని విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలు స్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. 
ఆయన ఒక్కరాత్రిలో నిర్మించా రో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది.ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహము చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది.అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది. నిజంగా ఈ విశ్వకర్మ గృహాలయం చాలా వింత గొలుపుతుంది.వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు అమోఘం,
పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందట. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. ఈ ఆలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాధలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.
ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతి ర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సంద ర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.






Thursday, February 27, 2014

మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము.(మహాశివరాత్రి సముద్ర స్నానాలు)






 రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దివావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని మనం చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. 
కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. 
"ఆచారహీనం నపునంతి వేదాః" అని శాస్త్రం. ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. "ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః" అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. 
శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు - తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 
అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. "అభిషేకాత్ ఆత్మశుద్ధిః" అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు - ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి. 
వాటిలో క్షీరము ప్రధానమైనది. శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. 
ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. వీటితో అభిషేకం చేయడం వల్ల ఒక కల్పవృక్షం ఎలా కోరికలు తీరుస్తుందో అలాంటి ఫలితములొస్తాయి. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.
రచన:>Bramhasri Samavedam Shanmukha Sarma(Options for this story)

Sunday, November 3, 2013

మా ఇంటి దీపావళి,

జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి ఫార్మాసిటీ కాలనీలో.....జరుపుకుంటున్న దీపావళి ద్రుశ్యాలు...!!!
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.క్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంట ఆ లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.
 ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా

 పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.

లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలను పొందండి.
ఆ తరువాత చెరుకుమోసులకు వత్తులు కట్టి వెలిగిస్తారు కొందరు...ఆయుథం కర్రలకు మరి కొందరు గోంగూర కాడలకు వత్తులు కట్టి వెలిగిస్తారు,అదే సమయంలో టపాసులు పేల్చుకుంటారు ,మందుగుండు సామాగ్రితో ఇల్లూదిపారి అందరూ సంతోసంగా గడుపుతారు,