Thursday, June 26, 2014

రాజ్ గడ్ ట్రెక్కింగ్ లో ....నా అనుభవం...!!!


                     రాజ్ గడ్ ట్రెక్కింగ్లో....నా అనుభవం...!!!

  రాజ్ గఢ్ మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఒక అందమైన పర్వత కోట. చత్రపతి శివాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన మరాఠా సామ్రాజ్యంలో రాజుగా పట్టాభిషేకం సమయంలో 1674 లో తన రాజధాని ఫోర్ట్ రాగ్ గడ్ ను ప్రకటించుకున్నారు.రాజ్ గఢ్ మహారాష్ట్ర రాష్ట్రం పశ్చిమ దక్షిణ భాగంలలో ఉంది
. భారతదేశం పశ్చిమ తీరంలో మరియు అరేబియా సముద్రం ఒడ్డున రాజ్ గడ్ సహ్యాద్రి పరిధి పడమటి కనుమలలో ఒక పశ్చిమ భాగంలోని ఉంది. జిల్లా ఉత్తరాన థానే జిల్లా, తూర్పున పూనే జిల్లాలో, దక్షిణాన రత్నగిరి జిల్లాలో, మరియు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంగా ముంబై హార్బర్ కలిగి ఉంది. రాయ్ గఢ్ మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఒక అందమైన పర్వత కోట.ప్రాంతం చారిత్రక కట్టడాల పర్యాటకులు అనేక ఇష్టమైన హాట్ స్పాట్ నింపుతారు. ఒక ప్రముఖ పర్వతారోహణ పాయింట్ కాకుండా అది కూడా సాహసోపేత పర్యాటక కేంద్రంగా ఉంది. ఒక కొండ భూభాగం మరియు సహజ ఆకులను అలంకరించబడిన రాజ్ గడ్ ఆసం అందం పర్యాటక రంగంలో ఒక ప్రముఖ స్థానంలో పొందుతాది.ఇక్కడ ప్రశాంతత స్థలాకృతి ఖచ్చితంగా బిజీ జీవితం నుండి వచ్చే వారికి మాత్రం ఓదార్పు ఉంది.

   పర్యాటకం లో భాగంగా ప్రతి సంవత్సరం మా మిత్రుడు కోట్ల మహక్ష్మీనాయ్డు నేను అనగా మునాసల అప్పలరాజు(బాబు)మరికొంతమంది మిత్రులుతో గత ఐదారు సంవత్సరాలుగా తీర్థయాత్రలు పేరుతో జ్యోతిర్లింగాల పేరుతో పన్నేండు జ్యోతిర్లింగాలకి పదునొకటి(11)జ్యోతిర్లింగాల దివ్యదర్శనం చేసుకున్నము.దీనిలో భాగంగానే గత సంవత్సరం 2013లో...మహారాష్ట్రం పరిప్రాతంలలో గల భీమశంకరజ్యోతిర్లింగం, వైధ్యనాదేశ్వరజ్యోతిర్లింగం,త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగములను దర్శించుకున్నాము,అయితే ప్రతి సంవత్సరం వెల్తున్న మా ఇద్దరు మిత్రులం తప్పా కొత్తగా మాతో మరో ముగ్గురో నలుగురో జతకట్టి ఇప్పటివరకూ వస్తున్నారు,దీనిలోని బాగమే రాజ్ గడ్ ట్రెక్కింగ్ కు ఆవకాశం కుదిరింది, ఈ రాజ్ గడ్ ట్రెక్కింగ్ ప్రయాణలో.........
   మొదటి రోజు  ట్రెక్‌లో కావలసిన డ్రై ఫ్రూట్స్, మరిన్న బలమైన ఆహార పదార్థాలు తీసుకొని పూణే వెళ్ళాం.ఆ మరుసటి  రోజు తెల్లారుజామునే రెండు మోటర్ బైక్స్ అక్కడున్న మా మిత్రుల దగ్గర తీసుకొని  నలుగురం కలసి పూణే, బెంగళూరు హైవే దారిపట్టాం. ఓ 20 కిలోమీటర్లు ప్రయాణించాక హైవే నుండి కుడివైపుకు తిరిగి మరో 20 కిలోమీటర్లు ఖేడ్‌శివపూర్ మీదుగా  గుంజావనే అనే చిన్న గ్రామానికి చేరుకొన్నాం, అక్కడే మా బైక్స్ పార్క్ చేసాం. అక్కడ నుండే ట్రెక్ మొదలయింది. ఆ రోజు మా అద్రుస్టంకొద్ది చాలా మంది ట్రెక్కర్స్ వచ్చారు, అందులో కుటుంబాలు కూడ వున్నాయి, ఆడ,మగ అంటు తేడా లేదు..పది పదిహేనేళ్ల వయసున్న పిల్లలు కూడ వున్నారు.
     ఇక ఈ రాజ్‌గడ్ చరిత్ర గురించి చెప్పడానికి అక్కడ ఎవరూ గైడ్స్ కానరాలేదు, కాస్త అంతర్జాలంలో వెదికితే కొన్ని విషయాలు దొరికాయి. ఈ కొండలున్న ప్రాంతాన్ని దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం కనుగొన్నారు., అక్కడ  విశ్వామిత్ర మహర్షి  నివసించినట్లు  చెబుతున్నారు.  తర్వాతెప్పుడో  అనగా 1490 లో నిజాం షాహి కాలంలో అహమద్ బహిరి ఈ రాజ్‌గడ్‌ని నిర్మించి "మురంబదేవ్" అని పిలిచేవారట! ఈ కోట  దాదాపుగా వీరి పరిపాలనలో 120 ఏళ్ళ పాటు వున్నదంటున్నారు.
    తర్వాత ఎప్పుడో  చత్రపతి శివాజి తండ్రి అయిన షహాజి రాజే బొన్సాలే పరిపాలనలో మొగల్ రాజుల వలన కొన్నియుద్దాలు జరిగాయట, కోటను వదులుకోవడం, మళ్ళీ స్వాదీనం చేసుకోవడం జరిగిందని చెప్పుతున్నారు.చత్రపతి శివాజి పరిపాలన కిందకు వచ్చాక ఆయన పరిపాలనలో మూడు వైపుల వున్న కొండల మీదుగా "కర్టన్ వాల్" లాగ కోటను నిర్మించి విస్తృత  పరిచి ఈ కోటకు "రాజ్‌గడ్" అని పేరు పెట్టారట. 1672లో శివాజి రాజే తన పరిపాలన కేంద్రాన్ని రాయిగడ్ కు  మార్చుకొన్నారు. శివాజి తదనంతరం ఆయన కుమారుడైన శంబజి రాజే పరిపాలన లో  మరాఠా రాజుల పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు.  తర్వాత మళ్లీ మొఘల్  రాజులు దాడులు చేసి యుద్దాలు జరిగిన సమయంలో శంబజి రాజే  మరణించారు. దానితో  మొగల్స్ అధీనంలోకి  మొత్తం మరాఠా రాష్ట్రమంతా పూర్తిగా  చేరిపోయింది.
     మా ట్రెక్ ప్రారంభమయిన గంటకు నా అనారోగ్యం ప్రభావం కనిపించింది.! ఒక యాభై  అడుగులు వేయగానే ఆయాసంతో కాసేపు నిలబడాల్సి వచ్చింది.  అప్పుడు ఒక్క క్షణం అనిపించింది ..మొండిగా ట్రెక్కింగ్‌కు వచ్చినందుకు బాగానే తగిన శాస్తి జరిగిందన్న భాద మనసులో మదిలింది.!
      అక్కడ వాతావరణం గంటకో సారి మారుతూ వున్నది, కాసేపు మంచుతో కూడిన మేఘాలు కమ్ముకొంటున్నాయి . మళ్ళీ కాసేపటికి మాయం అవుతూ ..దోబూచులాడుతున్నాయి..! వర్షాకాలం ముగిసే  సమయంలో అక్కడ ట్రెక్ చేయడం బాగుంటుంది..బాగా ఆకుపచ్చదనంతో..భూమంతా పరుచుకొని వున్నట్లుంటుంది, కాని మా ట్రెక్ అప్పటికే..వర్షాకాలం దాటి చాన్నాళ్లు అవడం మూలాన అప్పుడప్పుడే ఆకు పచ్చదనం నుండి మెల్లగా లేత పసుపు, ఆరంజి రంగులోకి మారుతున్నది! అది కూడా ఒక రకమైన సౌందర్య భరితంగానే  కనిపించింది.
     చాలా మంది ట్రెక్కర్స్ మా లాగానే  ఆ కొండను ఎక్కుతున్నారు. మరికొందరు దిగుతూ మాకు ఎదురవుతున్నారు..వారంతా రాత్రి పైన కోటలోనే బస చేసి ఉదయమే కొండను దిగుతున్నారు. ఒక్కో చోట చాలా ఏటవాలుగా వుంటున్నది..అక్కడ మాత్రం కాస్త కష్ట పడాల్సి వస్తున్నది. ఎటు చూసినా...ఆకుపచ్చని దుప్పటి కప్పుకొన్నట్లు కనపడుతున్నది, అక్కడక్కడ ఆ ఆకుపచ్చ దుప్పటి మడతలు  పడినట్లుగా కొండ వొంపులు కనపడుతున్నాయి. దాదాపుగా రెండు గంటలు తర్వాత ఒక పెద్ద రాతి కొండ మీదున్న కోట గోడను  అతి కష్టంతో చేరుకొన్నాము. ఆ  ప్రదేశం చాలా ఏటవాలుగా వున్నది, అక్కడున్న కొన్ని ఇనుప కడ్డీల  ఆధారం తో  ఎక్కగలిగాము.అదైనా చాలా ప్రమాదంతో కూడుకున్న పనే!..కాస్త పట్టు జారినా అంతే..ఏకంగా కొన్ని వేల అడుగుల కిందకు పడిపోవడమే....!! . ఆ కోట గోడ దాటి లోపలికి వెళ్లగానే పద్మావతి కొలను కనపడుతుంది. అంత ఎత్తైన కొండ మీద చాలా పెద్ద కొలను నిర్మించారు చత్రపతి శివాజి. అది కూడా పచ్చదనం మద్యలో వున్నది. దాని చుట్టు పడిపోయిన భవనం మొండి గోడలు కనపడుతున్నయి.
    అక్కడ నుండి కాస్త పైకి వెళ్లాక అక్కడ చాలా విశాలమైన పద్మావతి దేవాలయం వున్నది. కాని అందులొ దేవాతా విగ్రహాలు కనిపించాయి.ట్రెక్కర్స్ అందరూ అందులో విశ్రాంతి తీసుకొంటున్నారు. రాత్రి అక్కడే బస చేయాలనుకొనే వారు ఆ ఆలయాన్ని వసతి గృహంగా వాడుకొంటున్నారు. ఆ దేవాలయానికి  కుడివైపున ఒక పెద్ద బావి వున్నది. ఆ నీటినే  అక్కడి వారు మంచి నీరుగా వాడుకొంటున్నారు. అక్కడ ఒక చిన్న సైజు హోటలు వున్నది. అక్కడకొచ్చే ట్రెక్కర్స్ అందరు అక్కడే భోజనాలు చేస్తుంటారు.
   అప్పటికి  సమయం పది అయ్యింది. మధ్యాహ్నానికి   మేము కూడ మా నలుగురికి భోజనాలు  ఆర్డర్ ఇచ్చి అక్కడ నుండి మళ్లీ మా ట్రెక్ మొదలు పెట్టాం, అక్కడ నుండి మూడు దారులుగా చీలిపోతుంది.  మొదటగా ఎదురుగా వున్న రాతితో నిర్మించిన తాపల మీదుగా పైకి చేరుకొన్నాం అక్కడికి, దాదాపుగా 4514 అడుగులు ఎత్తు వున్నట్లు అక్కడ సమాచారం ఉంది. అక్కడకు పెద్ద రాతి ద్వారం గుండా  చేరుకోవాలి, అక్కడే శివాజి  సేనాపతి, మంత్రులు అయిన  తానాజీ, యశాజి, షంబర్ బట్ ల నివాస గృహాలు శిధిలమై వున్నాయి. అక్కడ కూడ 15 అడుగుల వ్యాసంతో  వున్న చిన్న కొలను  వున్నది.
     అక్కడ నుండి మధ్యాహ్నం  భోజన సమయానికల్లా  కిందకు వచ్చి  మా భోజనాలు చేసాక..కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ  కుడి వైపున వున్న మరో దారి వెంట వెళ్లాం..!  అక్కడ నల్లని రాతితో నిర్మించిన కోట ముఖ ద్వారం వున్నది. అక్కడ నుండితిరిగి వెనక్కి వచ్చి..మూడో రహదారి వెంట నడిచాం.., ఈ దారిలో ఏ కాస్త ఏమరపాటున నడిచినా అంతే...  ఏకంగా ఎక్కడికో.. వేల అడుగుల కింద వున్న అడవిలోకి  జారి పడి పోవడమే!! .అంత ప్రమాద కరమైన దారే కాని..సాహసికులకు మాత్రం మంచి థ్రిల్ ఇస్తుంది.  విచిత్రమేమిటంటే ఈ కోటకు మూడువైపుల గోడ లాగ కొండలున్నాయి. వాటి మీద కోట గోడలు కట్టారు..వాటివలన కోటకు ఎటువంటి ఉపయోగం లేదు.  ఈ మూడు కొండలు ఒక చోట కలుస్తాయి అక్కడ మాత్రమే కోట వున్నది..మరెందుకు ఈ కొండల మీద కర్టన్ లాగ కోటలు కట్టారో అర్థం కాదు. అసలు అక్కడికి చేరడానికి ఎన్నో ప్రయాస కోర్చి, ఎన్నో కష్టాలు పడ్డాం..! అటువంటి చోటకు ఎలా అంతంత పెద్ద పెద్ద రాళ్లు ఎలా మోసుకెళ్లారో ఆలోచిస్తే, ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. .ఎక్కడా కూడ నడవదగ్గ రహదారి లేనేలేదు..!  ఎంతో కష్ట పడి ఎక్కాల్సిందే..పైకి. ఎంత కష్ట పడ్డారోఅనిపిస్తుంది . ఎంతమంది మనుషుల శ్రమతో ఈ కోట తయారైందో!!
       అక్కడ నుండి సాయింత్రం అవుతుండగా కిందకు దిగడం మొదలుపెట్టాం, సాయింత్రానికల్లా గుంజావనే గ్రామం చేరుకొని అక్కడి నుండి మరో రోజు ఉదయం మరో వైపు నుండి ఈ కోటను చేరడానికి కొండ ఎక్కాలని మా ఉద్దేశం, అందుకోసం చాలా వేగంగా దిగుతున్నాం.  పై నుండి వర్షపు దారలు వలన ఏర్పడిన చిన్న చిన్న కాలువలు వున్నాయి వాటికి అటు ఇటుగా మట్టి గోడలు వున్నాయి..!
  సాయంత్రానికి మరలా తిరిగి  గుంజావనే చేరుకొన్నాం. మేము బాగా అలసిపోయిఉన్నాము.మనం జీవితంలో మళ్లీ తిరిగి ఇలాంటి ట్రెక్ చేయగలమా" అన్న ఆలోచన అందరిలోని ఒకేసారి కలిగింది. ఈ ట్రెక్ గురించి వివరించడం తో చాలా సులభంగానే అనిపిస్తుంది.ఈ ట్రెక్ చాలా కష్టపడాల్సి వచ్చింది నా అనుబవం ప్రకారం ప్రమాధంతో కూడుకున్న ట్రెక్ గా బావిస్తున్నాను,
    చివరగా  తోర్నా ప్రాంతం వెల్దామన్నారు,నేను రాను అని మొండికేయడంతో విరమించుకున్నాము.తోర్నా ప్రాంతం నుండి ట్రెక్ చాలా సాహసంతో కూడుకున్నదని కొదరన్నారు, ఇక్కడ ప్రకృతి రమణీయ దృశ్యాలు చాలా వున్నాయని విన్నాను ..కొన్ని ఫోటోస్ కూడ చూసాను..అవి చూసినప్పటి నుండి ఒకటే ఉబలాటం నాలోపల..ఎలగైనా అటు వైపు నుండి ట్రెక్ చేయాలని.  మా ఫ్రెండ్స్ ముగ్గురూరు తటపటాయించారు, మనసులో చాలా దృడంగా అక్కడీకి వెళ్లాలని వున్నా... నా అభిప్రాయానికి అందరూ తలూపి.....ఇంటి ప్రయాణం సాగించాం.
    
మన భారతదేశం లో  మహారాష్ట్ర రాష్ట్ర పూనే జిల్లా కోటలలో ఒకటి రాజ్ గడ్ కోట 1318 మీటర్ల సముద్ర మట్టం. గతంలో "మురుమ్ దేవ్" అని పిలిచేవారు, ఇది మరాఠా సామ్రాజ్య రాజధానిగా  రాయ్ గఢ్ ఫోర్ట్ రాజధాని,  దాదాపు 26 సంవత్సరాలు చత్రపతి శివాజీ మహారాజ్ పాలనా కాలంలో. ఈ కొండను పటిష్టం చేసి ఉపయోగించారు. ఈ కోటను ముట్టడించడం, ఎవరితరంకాదు, ఈ. కోటలో అత్యధిక భాగం రాజభవనాలు, నీటి తొట్టెలు ఉన్నాయి. మరియు గుహల అవశేషాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి.ఈ కోట శివాజీ కుమారుడు రాజారాం, శివాజీ క్వీన్ సాయిబాయి, ఆగ్రా నుండి శివాజీ తిరిగి, బల్లకిల్లా, సోనోపంత్ కఠినమైన పదాల మహాదర్వాజ్ గోడలలో అఫ్జల్ ఖాన్ తల ఖననం మరణం పుట్టిన అనేక చారిత్రక సంఘటనలున్నాయి, మా డంతో శివాజీ, మరియు ఖందోజి ఖోపాడే భాగం.ఈ కోట కూడా మొఘల్ దళాలకు నాయకత్వం చేసిన 1665 లో రాజపుత్ర రాజు జైసింగ్ తో పురందర్ సంధి (1665) కుదుర్చుకోవడం శివాజీ ఉండేందుకు 12 కోటలలో ఒకటిగా ఉంది. 22 ఇతర కోటలు ఇక్కడున్నాయి,




No comments:

Post a Comment