Saturday, December 6, 2014

శ్రీశైలం మల్లన్న...ఇష్థ కామేశ్వరి దేవి


ఇష్థ కామేశ్వరి దేవి - శ్రీశైలం
తిరుమల తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం, అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను క్రీశ్తు పూర్వం చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునే వారు. ఇప్పుడు మన భారతదేశంతో పాటు వివిధ దేశాలనుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.

మల్లన్న నిలయమైన శ్రీ శైలం ... సిద్ధ క్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అరణ్యంలో కనిపిస్తూ వుంటాయి. అలాగే ప్రాచీనకాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా 'ఇష్టకామేశ్వరీ ఆలయం' దర్శనమిస్తోంది.

పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న 'ఇష్టకామేశ్వరీ దేవి' ... నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి వుంటుంది.
 పక్షుల కిలకిలలు ... జంతువుల అరుపులు ... జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుంది.












ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి వుంటుంది. రెండు చేతులలో తామర పుష్పాలను ... మిగతా రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి వుంటుంది. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇదే విషయం 'ఇష్ట కామేశ్వరీ వ్రతం' లోను కనిపిస్తుంది.
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. 
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది. 
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు రూపం అలాగే ఉంటుంది,
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు. 
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.

ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారూ వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది. 
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి. 
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది. 
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది. 
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు  ఇక్కడ! 
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చింది ? 
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైవరైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసే వారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఉంది. 
ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములై నటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...

నాగుల చవితి

నాగుల చవితి
 సుబ్రహ్మణ్య షష్ఠి, స్కందపంచమి, కుమారషష్ఠి లానే కార్తిక చతుర్ది కూడా నాగు(పాము)లకు విశేషమైందే. శ్రావణ పంచమి నాడు నాగు(పాము)ల పుట్టలో పాలు పోసి పూజించినట్లే కార్తిక చవితినాడు పుట్టలో పాలు పోయటం, నాగులను పూజించటం చేస్తారు. ఈ నాగుల చవితినాడు పొద్దునే్ చన్నీటిస్నానం ఆచరించి ఇంట్లో నాగపడిగకు కాని నాగ ప్రతిమకుకాని పూజ చేస్తారు. ఆ తరువాత చల్లని పానకాన్ని, వడపప్పు, చలిమిడి, పాలు, కొబ్బరికాయ లాంటి వాటిని తీసుకెళ్లి పుట్టకు సమర్పిస్తారు. పుట్టకు దారం చుట్టటం కూడా కొందరు చేస్తుంటారు. పుట్టకు కొంతమంది కోడిగుడ్లు కూడా సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంతానాభివృద్ధి జరుగుతుందని హిందువల నమ్మకం.కొందరు నాగపుట్ట చుట్టూ నూకను చల్లుతూ ‘నాగరాజా నీవు నూక తీసుకొని మాకు మూకను ఇవ్వు’ అని ప్రార్థిస్తారు. మేము తెలియక చేసిన అపరాధాలను మన్నించమనీ ప్రార్థిస్తారు. ‘పడగ తొక్కితే పసివాడనుకో, నడుము తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలిగిపో’ అని నాగులకు వేడుకొంటారు. నాగపూజ వలన నేత్ర, ఉదర, కర్ణ సంబంధ వ్యాధులనుకూడా దూరం అవుతాయట.

నాగులను పూజించటం వల్ల వంశాభివృద్ధి, సౌభాగ్యసిద్ధి , సర్వాభీష్టాలు కలుగుతాయి. అసలు పిల్లలు పుట్టలేదని బాధడపడేవారు సైతం నాగ పూజ చేస్తేవారికి సంతానం కలుగుతుంది. శివపార్వతులు లోక కల్యాణంకోసం పుత్రార్థులై ఉన్నసమయంలో దేవతలు ఆటకం కలిగించినందుకు పార్వతి ఎంతో కోపగించుకొంది. ఆ సమయంలో బయల్వెడలిన శివతేజస్సును దేవతల కోరికపై అగ్ని ధరించాడు. అగ్ని వల్లకాక గంగకు శివరేతస్సును ఇవ్వగా గంగ కూడా భరించలేక రెల్లువనంలో శివరేతస్సును విడిచిపెట్టింది. అక్కడ శే్వతపర్వతం ఏర్పడింది. దాన్నుంచి శరవణం ప్రభవించింది. ఆ రెల్లు వనంలోని శివతేజస్సునుంచే బాలుడు ఉదయించాడు. ఆ బాలునికి కృత్తికలు పాలివ్వగా ఆరు ముఖాలనుంచి పాలు గ్రోలాడాబాలుడు. అందుకే కార్తికేయనామధారుడయ్యాడు. ఇతనికే సుబ్రహ్మణ్యుడన్న పేరు వచ్చింది. దేవమానవులను హింసించే రాక్షసాధముడైన తారకుణ్ణి సంహరించమని దేవతలు కోరగా దేవసైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్లి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. దేవతలు మెచ్చి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేశారు. ఈ సుబ్రహ్మణుడి ప్రీత యర్థమే నాగుల చవితి పూజలు చేస్తుంటారు.
మనకు కనిపించే నాగులు ద్విజ్విహులుకావడానికి ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కశ్యప ప్రజాపతికి కద్రువ వినతలు భార్యలు. తన సవతి అయన వినతతో కద్రువ ఓ సారి తాను చూచిన గుర్రపు తోక నల్లగా ఉందని పందెం కాసింది. వీరిద్దరిలో ఎవరి మాట తప్పు అయతే వారు రెండవ వారికి దాసిగా ఉండాలని పందెం వేసుకొన్నారు. తాను నెగ్గాలనుకొన్న కద్రువ తన సంతానాన్ని వెళ్లి ఆ గుర్రపు తోకకు చుట్టుకొని ఉండి తనను గెలిపించమని కోరింది. తన కొడుకు వలన గెలిచిన కద్రువకు వినత దాసి అయంది. ఆ దాస్యత్వం పోగొట్టడానికి ఏం చేయాలని వినత కుమారుడైన గరుత్మంతుడు నాగులను కోరగా వారు ఇంద్రుని దగ్గర ఉన్న అమృతభాండాన్ని తెచ్చి ఇవ్వమనికోరారు. వారు చెప్పిన విధంగా - దేవతలతో యుద్ధం చేసి గెలిచి అమృత భాండాన్ని తీసుకొని రాబోతుండగా ఇంద్రుడు గరుత్మంతుని పట్టుదలా, నిజాయతీల మెచ్చుకుని నీవు ఈ అమృతభాండాన్ని నాగులకిచ్చి స్నానం చేసి శుచులై వచ్చి తీసుకోమని చెప్పమని చెప్పాడు. ఇంద్రుడు చెప్పినట్లుగానే గరుత్మంతుడు నాగులకు చెప్పి దర్భపైన అమృతభాండాన్ని పెట్టాడు గరుత్మంతుడు. నాగులు శుచులై వచ్చేలోపు ఇంద్రుడు అమృతభాండాన్ని తీసుకొని వెళ్లగా ఆ దర్భలను నాగులను నాకారట. దానితో దర్భలవల్ల నాలుక రెండుగా చీలినా అమృతభాండస్పర్శఉన్న దర్భల వల్ల వారికి అమృతత్వం వచ్చిందంటారు.

మన దీపావళి,2014

మన దీపావళి,

జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి ఫార్మాసిటీ కాలనీలో.....జరుపుకుంటున్న దీపావళి ద్రుశ్యాలు...!!!
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు,ఈ దివ్య దీపావళి సోయగాలు.అయితే ఈ సంవత్స్రరం హుద్ హుద్ తుపాను ప్రబావంవలన విశాఖ జిల్లాలో బారీగా నస్టం వాటిల్లడంతో పాటు ఎక్కడ చెట్ట్లు అక్కడే పడి ఉండడంతో అగ్నిప్రమాథాలు జరగ కుండా ప్రభుత్వం  బాణసంచా చప్పుళ్ళు,లేకుండా చరతలు విదించింది,అయితే  ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంట ఆ లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.అలాగే చెరకు మోసులకు కొందరు,గోంగూరకాడలకు ఆముదం మొక్కలకు మరికొందరూ ఇలా వత్తులు కట్టి దేవుని గదిలో పూజించి అక్కడ వున్న ప్రమిద దీపానికి వెలిగించి వీదులలో నిలబడి వెలుగిస్తుంటారు,ఆ వత్తులు గణమైన తరువాత ఆ కర్రలను నేలపై మూడు సార్లు కొట్టి అమావాస్య వెల్లిన మూడు రోజుల తరువాత నాగులచవితి అని నినాదాలు చెప్పితారు,
 ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా  పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.
లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలను పొందండి.
ఆ తరువాత చెరుకుమోసులకు వత్తులు కట్టి వెలిగిస్తారు కొందరు...ఆయుథం కర్రలకు మరి కొందరు గోంగూర కాడలకు వత్తులు కట్టి వెలిగిస్తారు,అదే సమయంలో టపాసులు పేల్చుకుంటారు ,మందుగుండు సామాగ్రితో ఇల్లూదిపారి అందరూ సంతోసంగా గడుపుతారు,





తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం...

తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం:----

యన్మూలె సర్వ తీర్ధాని- యన్మధ్యే సర్వ దేవతాః l 
యదగ్రే సర్వ వేదాశ్చ - తులసీం త్వాం నమామ్యహం ll 

తులసి దళములు కోసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు:---

ప్రసీద మమదేవేసి ప్రసీద హరివల్లభే l 
క్షీరోద మథనోధ్బూతే తులసి త్వం ప్రసీదమే ll 

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే l 
అగ్రతః శివరూపాయ వృక్షరాజయ తే నమః ll 

బ్రహ్మార్పణం బ్రహ్మహవిహీ బ్రహ్మొగ్నౌ బ్రహ్మణాహుతం l 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ll