Wednesday, April 8, 2009
Monday, February 23, 2009
Wednesday, September 3, 2008
వినాయకుని గ్రామం
ఈ సందర్భంగా మనం వినాయకుని గ్రామం వెళ్ళొద్దాం.వినాయకుని గ్రామం ఎమిటి,ఎక్కడ ఉంది అంటే తమిళ్‌నాడులోని పిళ్ళయార్‌పట్టి యే ఆ గ్రామం.తమిళ్‌లో పిళ్ళయార్ అంటే వినాయకుడు.పట్టి అంటే గ్రామం.తమిళ్‌నాడులో శివునికి,ఆయన కుమారులకి ఉన్న ప్రాధాన్యం అందరికి తెలిసిందే.కాని తమిళ్‌నాడు మొత్తంలో అత్యంత ముఖ్యమైన వినాయకుని ఆలయం ఇది ఒక్కటే.
ఇది పుదుకొట్టైకి,కారైకూడి మధ్యన ఉంది.ఇక్కడ ఆరడుగుల ఎత్తుతో కూడిన రాతి విహ్రం అందరిని అలరిస్తుంది.గుడి ముందు కోనేరు,గుడిలో బంగారు తొడుగుతో వినాయకుడు,గుళ్ళో ఏనుగు తప్పక చూడాలి.గుడి చాల విశాలంగా భక్తి భావం పెంచేలాగ వుంటుంది.ఇక్కడ గోడపై ఉన్న వినాయకుని చిత్రాన్ని ఏ పక్కనుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లు చిత్రించారు.అది తప్పక చూడాలి.క్రీ.శ.400 నాటిదైన ఈ ఆలయం ఈ మధ్యనే కొత్త రంగులు దిద్దుకుంది.
గుడిలోపల ఒక మూల వినాయకుని వాహనమైన మూషికం విగ్రహం ఉంటుంది.అది ఒక మూల అంతగ కనిపించకుండా ఉండటం చేత అందరు చూడరు.ఆ మూషికం చెవిలో మన కోర్కెలు చెపితే అది గణనాధునికి చేరవేస్తుందని ప్రతీతి.
ఇక్కడి వెళ్ళాలంటే పుదుకొట్టై నుంచి ఐతే మధురై వెళ్ళే దారిలో తిరుపత్తూర్ దగ్గర దిగి అక్కడినుంచి కారైకూడి వెళ్ళే కొన్ని బస్సులు లేదా లోకల్ బస్సులు కొన్నిట్లో చేరుకోవచ్చు.కారైకూడి నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది.పుదుకొట్టై నుంచి ఐతే గంటన్నలో అక్కడికి చేరుకోవచ్చు.వినాయక చవితికి ఇక్కడ పదిరోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.ఇక్కడికి దగ్గరలో సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం కుండ్రకుడి ఉంది.అది పిళ్ళయార్‌పట్టి నుంచి 5 కి.మీ.ఉంటుంది.
నేనెప్పుడు పుదుకొట్టై వెళ్ళినా పిళ్ళయార్‌పట్టి వెళ్తుంటాను.అందరు తప్పక చూడవలసిన ప్రదేశం.ఒక్క తమిళ్‌నాడు నుంచే కాక కేరళ,కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు.మీకు చాన్స్ వస్తే తప్పక చూడండి.నేను ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను.
అదండి వినాయకుని గ్రామం విశేషాలు.ఆ గణపతి అందరికి ఆయురారోగ్యాలు,అష్టైస్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ విహారి.
Thursday, December 13, 2007
పళని
అందరికి మరొక్కసారి కొత్తబంగారులోకానికి స్వాగతం.ఎన్నో విశేషాలతో కూడిన సుబ్రహ్మణ్యస్వామియొక్క దివ్యక్షేత్రం పళని.ఆ ఆలయాన్ని సందర్శించివద్దాం.తమిళనాడులో వినాయకుని ఉన్నట్లే సుబ్రహ్మణ్యస్వామికి చాలా దేవాలయాలు వున్నాయి.వాటిలో అతి ముఖ్యమైన ఆరు దేవాలయాలని కలిపి "ఆరుపడైవీడు" అని పిలుస్తారు.ఆ ఆరు ఎమిటి ,పళని అనే పేరు ఎలా వచ్చింది,ఇంకా ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.సుబ్రహ్మణ్యుని మురుగన్,శరవణన్,కార్తికేయన్,షణ్ముకన్,దేవసేనాపతి ఇంకా చాలా రకాల పేర్లతో పిలుస్తారు.తమిళనాడులో వున్న మురుగన్ యొక్క "ఆరుపడై వీడు" దేవాలయాలు 1.తిరుచెందూర్,2.స్వామిమలై,3.పళని,4.తిరుపరంకుండ్రం,5.తిరుత్తణి,6.పాలముదిర్ సోలై.
వాటిలో అతి ప్రసిద్దమైనది,ముక్యమైనది పళని.పళని ఆండవర్ గా పిలిచే ఇక్కడ స్వామి దండయుధపాణి.చేతిలో దండంతో కొలువై వుంటారు.మెడలో రుద్రాక్ష మాలతో కనిపించే స్వామిది సాధురూపం.ఇది దిండిగల్ జిల్లాలో వుంది.పచ్చని కొండల్నడుమన వున్న ఇక్కడికి వెళ్ళటం చాలా తేలిక.దిండిగల్-కోయంబత్తూర్ రైలుమార్గంలో పళని రైల్వే స్టేషన్లో దిగితే రెండు మైళ్ళ దూరంలో కొండ కనిపిస్తుంది.ఇక మదురైనుంచి కూడా ఇక్కడికి వెళ్ళవచ్చు.కొడైకెనాల్ కూడా ఇక్కడికి దగ్గర.
ఇక పళనికి ఆ పేరు రావటానికి ఒక కారణం వుంది.ఒకసారి కైలాసంలో శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు,సుబ్రహ్మణ్యునితో పాటు వుండగా నారదుడు ఒక జ్ఞానఫలమును ఇచ్చారు.పిల్లలమీద ప్రేమతో పార్వతి ఆ పండును కుమారులకి ఇద్దామని అనుకొన్నా అది ఒకటే పండు.దానిని ముక్కలు చేయకూడదు అని నారదులవారు చెప్పెను.దానితో వారికి ఒక పరిక్ష పెట్టెను.ఎవరు ముందుగా ఈ లోకంలో వున్న అన్ని పుణ్యతీర్ధాలలో తిరిగి ముందు వస్తారో వారికి ఈ ఫలము ఇస్తానని చెప్పెను.దానితో సుబ్రహ్మణ్యుడు నెమలిపై వెళ్ళిపోయెను.కాని వినాయకుడు తల్లితండ్రుల చుట్టూ మూడుసార్లు తిరిగి ఆ ఫలమును సంపాధించెను.తరవాత వచ్చిన మురుగన్ ఆ విషయము తెలిసి అలిగి ఈ ప్రాంతానికి వచ్చి వుండిపోయారు.దానితో శివపార్వతులు ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యుని బతిమాలుతు "ఫలం నీ"(నీవే ఫలము)అని బతిమాలిరి.అలా కాలక్రమంలో ఈ ప్రాంతానికి పళని అని పేరు వచ్చింది అనేది పురాణగాధ.
7వ శతబ్దంలో కేరళ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు.తర్వాత నాయకరాజులు,పాంద్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ది చేసారు.సముద్ర్మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఈ గుడి వుంది.కొండపైకి వెళ్ళటాని మెట్లు వున్నాయి.మెట్లు ఎక్కలేనివారి కోసం రోప్ వే మార్గం వుంది.
కొండపైకి వెళ్ళటానికి మొత్తం 697 మెట్లు వున్నాయి.
విశేషాలు:
1.దేశంలో తిరుపతి తర్వాత,తమిళనాడు మొత్తానికి ఎక్కువ ఆదాయంవచ్చే క్షేత్రం పళని.
2.ఆలయగోపురం బంగారంతో పూతపూయబడి వుంటుంది.
3.ప్రతియేటా జరిగే "పంకుని ఉత్తిరం","తాయిపూమాసం" ఉత్సవం చూసితీరాల్సిందే.ఆ సమయంలో ఎక్కడెక్కడినుంచో భక్తులు పాదయాత్రలు చేస్తూ స్వామిని దర్శించటానికి వస్తారు.పసుపు బట్టలుకట్టుకుని కాలినడకన వందల కి.మీటర్ల దూరం నడిచి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు.తాయిపూసం అప్పుడు పదివేల కావడులు,పంకుని ఉత్తిరం అప్పుడు రమారమి 50,000 కావడులు పాలు,రోజ్ మిల్క్ వస్తుందని ఒక అంచనా.
చిన్నపిల్లలకి మురుగన్ లాగ వేషం వేయించి నెమలి ఈకలతో అలంకరించబడిన కావడి మోసుకొని వస్తారు.అలాగే మొక్కుకున్నవారు తమ శరీరానికి శూలలుగుచ్చుకొని వస్తారు.
4. ఇక పళని ప్రసాదం తిరుపతి లడ్డు ఎంత ఫేమసో పళని "పంచామృతం" అంత ప్రసిద్ది.స్వామికి పంచామృతంతో రోజూ అభిషేకం చేస్తారు.అతి రుచికరంగా వుండే ఈ పంచామృతం.పేరు చెపితే నోరూరేటంత రుచిగా వుంటుంది. కర్జూరం,అరటిపండు,తేనే,నెయ్యి,కలకండ,కిస్మిస్,జీడిపప్పు మొదలైనవి కలిపి చేసే ఈ పంచామృతం చాలా రోజులు అంటే నెలలు కూడ నిలువ వుంటుంది.పావుకిలో ధర 25రూ.
5.ఇక్కడ స్వామి కౌపీనం(గోచి) మాత్రమే ధరించి వుంటారు(నిజరూపంలో).
Monday, October 1, 2007
ద్వారకాతిరుమల(చిన్న తిరుపతి)
అందరికి నమస్కారం.మొన్ననే ద్వారకాతిరుమల వెళ్ళివచ్చాను.ఆ గుడి విశేషాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.రాష్త్రంలో తిరుపతి తరువాత అంత ప్రముఖమైన వెంకటేశ్వరక్షేత్రం చిన్న తిరుపతి అనబడే ద్వారకాతిరుమల.పశ్చిమగోదావరి జిల్లాలో అధిక ఆదాయం వచ్చే మొదటి ఆలయం ఇది.దీని చరిత్ర చూద్దాం.
చరిత్ర:
త్రేతాయుగంలో స్వామి ఇక్కడ శేషాకృతిగల కొండపై వెలిశారు.ద్వారకా మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు తనపాదాలను ఆ మహర్షికి ఇచ్చుటచే ఈ క్షేత్రమునకు "ద్వారకాతిరుమల"అని పేరు వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరాముని తాతగారైన అజమహారాజు,తండ్రి అయిన దశరధుడు,స్వయముగా శ్రీరాముడు స్వామిని సేవించినట్లు పురాణాలలో వుంది. మైలవరం జమిందారులు సూరానేని వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తృత్వం వహించేవారు.ఈ మధ్యే ధర్మకర్తృత్వానికి ఎన్నిక పెట్టాలని అనుకుంటున్నారు.
ఆలయ విశేషాలు:
ఇక్కడ స్వామి దక్షిణాభిముఖులై వుంటారు.ఇక్కడ శ్రీనివాసుని పాదాలు పుట్టలోనున్న ద్వారకునిచే పూజించబడుటచే స్వామిని సేవించుకొను భక్తులకు ఆ పాదాలు కనిపించవు.కనుక ధృవమూర్తికి వెనుకభాగమున పీఠంపై సంపూర్ణ శిలావిగ్రహమును ప్రతిష్టించారు.ఇలా ఒకే విమానం కింద రెండు ధృవమూర్తులు వుండటం విశేషం.రెండు ధృవమూర్తులు ఉండటం వల్ల ఏడాదికి రెండుసార్లు కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. మొక్కులు మొక్కుకొని పెద్దతిరుపతి పోలేని భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చని అంటారు.ఇక్కడ స్వామికి కోపం ఎక్కువని ఇక్కడ మొక్కుకొని మొదట ఇక్కడకు రాకుండ పెద్దతిరుపతి వెళ్ళి తర్వాత ఇక్కడికి వస్తే స్వామికి కోపం వస్తుందని అంటారు.ప్రాకారం నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు వున్నాయి.వీటిలో దక్షిణ ద్వారము వైపు గల గోపురం పెద్దది.దీనికి 5 అంతస్తులు వున్నాయి.
స్వామివారి సన్నిధి కుడివైపు అలివేలు మంగతాయారు,ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలున్నయి.ధ్వజస్తంభానికి వెనుక భాగాన్న స్వామివారికి ఎదురుగా భక్తాంజనేయ,గరుడాళ్వార్ల ఆలయం వుంది.భక్తులు తలనీలాలు సమర్పించటానికి ఆలయం బయట పడమర వైపు కళ్యాణకట్ట వుంది.తూర్పువైపు ప్రసాదాల కౌంటర్ వుంది. ఆలయం తొలిమెట్టు వద్ద పాదుకామండపం వుంది.ఇక్కడ స్వామివారి పాదాలు వుంటాయి.
గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ దణ్ణం పెట్టుకొని వెళ్ళటం సాంప్రదాయం.మెట్లకు తూర్పువైపున అన్నదాన సదనం వుంది.ఊరికి ముందు మనకు గరుడాళ్వారుని భారి విగ్రహం కనిపిస్తుంది.అలాగే టి.టి.డి వారి కళ్యాణ మండపం వద్ద భారి ఆంజనేయ విగ్రహం వుంది.
ఆలయ ఆధ్వర్యంలోనే కాక ఇతరులు కూడా కళ్యాణ మండపములు నడుపుతున్నారు.పెళ్ళిళ్ళ సీజన్లో ఊరు కలకలలాడుతూ వుంటుంది.
కళ్యాణాలు:
వైశాఖ మాసంలో దశమి నుంచి విదియ వరకు ఒకసారి,ఆశ్వీజమాసంలో విజయదశమి నుంచి విదియ వరకు రెండో సారి ఘనంగా జరుగుతాయి.ఇది కాక భోగి రోజున గోదాకళ్యాణం జరుగుతుంది.
వేళలు:
ఉదయం 6 గంటలనుండి మధ్యానం 1 గంటవరకు.తిరిగి 3 గంటల్నుంచి రాత్రి 9 గంటలవరకు.
ప్రయాణం:
మద్రాస్ నుండి కలకత్తా వెళ్ళే జాతీయరహదారిలో భీమడోలుకు 17 కిలోమీటర్లలోను,తాడేపల్లిగూడానికి 47 కి.మీ.,ఏలూరు కి 41 కి.మీ దూరంలో వుంది.ఏలూరు,తాడేపల్లిగూడెం స్టేషన్లలో అన్ని ఎక్స్ ప్రెస్స్ రైళ్ళు ఆగుతాయి.భీమడొలు స్టేషన్లలో తిరుమల,సింహాద్రి ఎక్స్ ప్రెస్స్లు పాసింజర్లు ఆగుతాయి.జిల్లలోని అన్ని ముఖ్యపట్టణాలనుంచే కాకుండా విజయవాడ,రాజమండ్రి,మచిలిపట్ణం నుంచి ప్రతి శనివారము మరియు ప్రత్యేక దినములలో బస్సులు వెళ్తాయి. హైదరాబాదునుంచి కూడా ఎ.పి.టూరిజం వాళ్ళు బస్సు నడుపుతున్నారు. దేవస్థానం వారి సమాచార కార్యాలయం పాదుకామండపం దగ్గర వుంది.ఉండటానికి అనేక సత్రాలు,అతిధి గృహాలు వున్నాయి.
చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు:
మద్ది ఆంజనేయస్వామి దేవాలయం:
ఇది ఇక్కడినుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో గురవాయిగూడెం లో వుంది.ఈ ఆలయం చాలా విశేషమైనది.స్వామి మద్ది చెట్టుకింద వెలిసారు.తప్పక చూడవలిసిన ప్రదేశం.
రేణుకాదేవి(కుంకుళ్ళమ్మ) ఆలయం:
ఇక్కడినుంచి 1కి.మీ.దూరంలో భీమడోలు మార్గంలో వుంది.ఈ అమ్మవారు ప్రయాణంలో భక్తులకు కష్టాలు కలగకుండా చూస్తారని నమ్మకం.

Tuesday, September 4, 2007
సింహాచలం
అందరికి నమస్కారం.
నేను డిగ్రీ లో వుండగ మా ఫ్రెండ్స్ ఆరుగురు కలిసి సరదాగ వైజాగ్ టూర్ కి వెళ్ళాం.మా స్నేహితులలొ ఒక అబ్బాయి వాళ్ళ పెదనాన్నగారు సింహాచలం గుడిలొ ప్రధాన అర్చకులు.మాకు వాళ్ల ఇంట్లోనే మకాం.పొద్దున్నే అన్ని పనులు ముగించి గుడికి బయలుదేరాము.కొండ మీద వెలసిన శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటానికి రెండు మార్గాలు వున్నాయి.ఒకటి మెట్లదారి.రెండు గాట్ రోడ్లో బస్ ప్రయాణం.మేము వెళ్ళటప్పుడు బస్ కి వచ్చేటప్పుడు మెట్లమీదుగ నడిచివచ్చాం.గుడిలొ ఉచితదర్శనం,50రూ|| ప్రత్యేక దర్శనం వున్నాయి.మేము పూజారిగారి తరుపున కాబట్టి మాకు ప్రత్యేక దర్శనంలొ ఉచితదర్శనం.గర్బగుడి దగ్గరకు వెళ్ళే అద్రుష్టం కలిగింది.కావలసినంత సేపు దర్శనం చేసుకుని తరవాత పూజరిగారు ఇచ్చిన పులిహోర,దద్దొజనం,పొంగలి సుబ్బరంగా లాగించి గుడిలో మళ్లి ఒకసారి రౌండ్ వేసి మెట్లమీదుగా దిగివచ్చేసాం.
చరిత్ర:
ప్రహ్లాదుని రక్షించటానికి నరసింహావతారంలోఅవతరించి హిరణ్యకశిపున్ని సంహరించిన తరువాత ప్రహ్లాదుని కోరికపై స్వామి ఇక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారు.244మీటర్ల ఎత్తెన కొండపై వెలిసిన ఈ స్వామికి 11వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని కట్టించారు.తరువాత విజయనగరరాజులైన ప్రతాపరుద్రగజపతి ఆలయానికి మరికొన్ని మెరుగులు దిద్దారు. గత రెండు దశాబ్దాలుగా విజయనగర రాజవారసులే దేవస్థాన ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.గుడిలో కప్పస్థంభం వుంటుంది.దీనిని కౌగిలించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరతాయని అంటారు.
చందనోత్సవం :
ప్రతి యేడాది వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగే చందనోత్సవానికి ఆంధ్రప్రదేశ్,ఒరిస్సా,కర్ణాటక,తమిళనాడు నుంచి భక్తులు విపరీతంగా వస్తారు.ఈ చందనోత్సవాన్నే నిజరూపదర్శనం అని కూడా అంటారు.సంవత్సరంలోని 364 రోజుల 12 గంటలు చందనంతో కప్పబడి వుండే స్వామి ఆ రోజు ఉదయం 3 నుంచి సాయంత్రం వరకు మాత్రమే స్వామి నిజరూపదర్శనం కలుగుతుంది.ఆ రోజు స్వామి ఒంటి మీది చందనాన్ని తీసివేసి అభిషేకించి కొత్తగా చందనాన్ని పూస్తారు.నిజరూప దర్శనానీ మొదట విజయనగర రాజవంశీకులు చూస్తారు.తర్వాత భక్తులని అనుమతిస్తారు.ఉచిత దర్శనానంతో పాటు రూ. 30, రూ. 100, రూ. 500 , రూ. 1000 టికెట్లు అమ్ముతారు.
ప్రయాణం:
వైజాగ్ లో సింహాచలం కొండ దిగువున వుండే బస్ స్టాపుకి వెళ్లటానికి లొకల్ బస్సులు వుంటాయి.కొండ మీదకి దేవస్థానం వారు ప్రత్యేక బస్సులని నడుపుతారు.దాని టికెట్ ధర రూ.6.

No comments:
Post a Comment