Friday, February 20, 2015

తాడి శివాలయం

శ్రీ శ్రీ శ్రీ ఉమానీలకంటేశ్వర ఆలయం...తాడి గ్రామ పంచాయితీలో వ్రుషభాచల పర్వతం దరి 12వ శతాబ్దంనకు ముందే కనుగొన్నట్ళు తెలుస్తుంది...ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పరవాడ మండలం..తాడి గ్రామ సమీపంలో వుంది...
మహాశివరాత్రి రోజునాలాగే కార్తీకమాసంలో సోమవారానికి గల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కార్తీక సోమవారం రోజున సాయంత్రం వేళలో చేసే శివాభిషేకం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించినా అదే ఫలితం కలుగుతుంది. అదే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో నదీస్నానం చేసి శివుడిని అభిషేకించి ... బిల్వదళాలతో అర్చన చేస్తుంటారు.అలాగే వైష్ణవ ఆలయాల్లో తులసి దళాలతో సేవిస్తుంటారు.

 ఈ కారణంగానే శివకేశవులు కొలువైన క్షేత్రాలకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంటారు. దాంతో ఆ రోజున ఈ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దూరాభారం వలన ... ప్రసిద్ధి చెందిన క్షేత్రాలకు వెళ్లలేక పోయినప్పుడు,మీకు ఏదైనా దగ్గరలోని ఉండే హరిహరుల క్షేత్రాలనైనా దర్శించడం వలన కూడా అదే ఫలితం
లభిస్తుంది. అయితే ప్రచారానికి దూరంగా మారుమూల గ్రామాల్లో గల కొన్ని విశిష్ట క్షేత్రాలను గురించి తెలిస్తే అక్కడికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

 విశాఖపట్టణం జిల్లా పరవాడ మండల పరిది తాడి గ్రామం సమీపంలో వ్రుసభాశలం దగ్గర శ్రీ ఉమానీలకంటేశ్వర ఆలయం ఉంది అయితే ఇక్కడ తగినంత ప్రచార ప్రాచుర్యం లేకపోవడంవల్లనే ఇక్కడ భక్తుల సందడి తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా శ్రీ ఉమానీలకంటేశ్వర లను దర్శించి ... మనసారా వాళ్లకు పూజాభిషేకాలు జరిపించి వనభోజనాలు చేసి వెళ్లాలనుకునే వారు ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఇలాంటి ఆలయాలను గురించి ఒకరి ద్వారా మరొకరికి తెలుస్తూ ఆలయాలకి పూర్వవైభవం వస్తే భక్తులకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.





1 comment: