Thursday, July 10, 2014

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడ విశేషం.త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం ఉంది .అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. 
శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.
మూలతో బ్రహ్మరూపాయ 
మధ్యతశ్చ మహేశ్వరం 
అధతో విష్ణురూపాయ 
త్ర్త్యెక్య రూపాయతేనమః

స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.
దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.
ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది.
పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్యదేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తుంటారు.వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.


Wednesday, July 9, 2014

అమర్నాద్ యాత్ర విశేషాలు

అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చి నట్లైతే మృత్యువుని చాలా దగ్గరలో చూసి వచ్చినట్లే...!!!

అమర్నాద్ యాత్ర విశేషాలు

మర్నాద్  "అమరనాధుడంటే"  జరామరణములు లేని వాడు అని అర్ధం .  హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం మరియు అత్యంత ప్రమాదకరమైన యాత్ర కూడా . చుట్టూ మంచు ఎత్తైన కొండలు , ఎటుచూసినా మంచుతో కప్పబడి ఉన్న కొండలు , మంచు కరగడం చేత కొండలు స్నానం ఆడుతున్నాయా అనే భావం కలిగించేలా ఉండే సౌందర్య దృశ్యంమే ఈ ప్రదేశం .కొండలపైనుంచి కరిగి వస్తున్న మంచును తన వడిలోకి చేర్చుకుని వయ్యారంగా వంపులు తిరుగుతూ ప్రవహించే సింధు నది . ఆ నదిలోంచి వచ్చే శబ్దాలు పై నుంచి మనకు కనిపిస్తున్నా మానసికంగా మాత్రం ఆ సింధు నదిలోనే ఆడుతూ పాడుతున్నట్టుగా ఉంటాదంటూన్నారు యాత్రికులు .. ఎప్పటి నుంచి ఉన్నాయో పెద్దపెద్ద చెట్లు కనిపిస్తుంటాయి.. ఇక్కడ శివయ్య లేకపోతే నేను ఇంత సాహసం చేసి వచ్చేవాడినా ...భక్తులుకు ఇంత ప్రకృతి అందాలను చూడగలిగే వాన్నా అని పించక మానదు . 
స్థల పురాణం

అమరనాధుడంటే జననమరణాలు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ! నీవు జన్మించినప్పు డంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను అని బదులిచ్చాడు. పార్వతీ దేవి నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నావు ఇది ఎలా సాధ్యం అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతికి చివరకు ఈశ్వరుడు అమరనాధ్‌ గుహను ఎంచుకున్నాడు. పహల్‌ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్‌ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్లాడు. షిషాంగ్‌ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌ గుహలోపలికి వెళ్లాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు.
వంటిలో ఓపిక   ఉండగానే యాత్రలు చెయ్యాలి అనే మాట .. వయసు పైబడిన తరువాత అమర్నాద్ వచ్చే భక్తులకు గుర్తోచ్చి తీరుతుంది . వంటిలో ఓపికున్నప్పుడు అమరనాధుడు గుర్తుకు రావాలి .. ఆయన అనుగ్రహం కూడా ఉండాలిగా !
పర్వతాల పై మంచుపడి ఆ మంచుపై సూర్యకిరణాలు పడటం చేత వచ్చే తెల్లటి కాంతి లోనే శివయ్య దర్శనం ఇస్తూ ఉంటాడు .
ఈ యాత్ర సాహస యాత్ర ని చెప్పడానికి కారణం . సరైన రవాణ సౌకర్యం లేకపోవడం . నిజానికి ఈ అమర్నాద్ యాత్ర జూలై లో ప్రారంభమై - ఆగష్టు లో ముగుస్తుంది . 45 రోజులు మాత్రమే అమర్నాద్ యాత్ర ఉంటుంది . ఆ తరువాత ఈ ప్రాంతం మంచుతూ కప్పబడిపోతుంది . తిరిగి జూలై లోనే ప్రారంభం అవుతుంది . ఈ ప్రాంతం లో ఎవరూ నివసించరు . ప్రయాణం అంతా ఇరుకు రోడ్లపై నే సాగుతుంది . 
ఏ మాత్రం కాస్త అజాగ్రత్త ఉన్న అంతే సంగతులు .. ఇక్కడ గుర్రాలు తప్ప మరే ఇతర వాహనాలు ఉండవు .కొందరు భక్తులు హెలికాప్టర్ పై వచ్చినా సరే 6 కిలోమీటర్లు ముందే హెలికాప్టర్ ఆపివేస్తారు . అక్కడ నుంచి గుర్రాలకు వేరేగా డబ్బులు ఇచ్చి ప్రయాణం కొనసాగించాలి .
గుర్రాలపై ప్రయాణం అంత సులువు కాదు . మనం ఎక్కినా 5 - 10 నిమిషాల్లోనే  ఒళ్ళంతా కదిలిపోవడం చేత ఇంకా ఎంత దూరం అని అడగకుండా ఉండలేము . చుట్టూ కొండలు ఎత్తైన ప్రదేశం లో మనకు .. ఎంత లోతుందో తెలియని లోయలు .. వేగంగా ప్రవహిస్తూన్న సింధు నది . గుర్రం అటు ఇటు కదలడం కాస్త అటు పక్కకి ఇటు ప్రక్కకి కదులుతూంటే .. శివ శివా అని మనకు తెలియకుండానే శివనామస్మరణ చేస్తాం .  
అమర్నాద్ గుహ శ్రీనగర్ ( జమ్మూ మరియు కాశ్మీర్  ) కు 141 కిలోమీటర్ల దూరంలో 3,888 m (12,756 ft) ఎత్తులో ఉంది .
 జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి , పహల్ గాం నుంచి గుహ కు చేరే లోపు మనం 
 కూడా చూస్తూ వెళ్తాం . 
జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెలవారకముందే   వెళ్ళాలి.
*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యమవుతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.
* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మినీ బస్సులు లభ్యమవుతాయి. లిడ్డర్ నథీ తీరం వెంట ఈ బస్సు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
* శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.
* శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు. 
సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యాత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతు వచ్చే అనుభూతికి లోనవుతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.
పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి .సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతమంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశివుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.
* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పల్లకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రయాణం సాగుతున్నంతా సేపు .. కొండల్లోంచి వచ్చే చల్లటి గాలి .. ఉన్నట్టు ఉండి మన గుర్రం పడిపోతుందేమో అనే భయం .. కొండల అంచుల్లో ప్రయాణం .. చుట్టూ చూస్తే అబ్బ ఎంత బాగుంది .. ఆహ చాలు ఈ జన్మకి నేను చూడగలిగాను చూస్తున్నాను అనే ఆనందం కలుగుతుంది, .. 
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.

ఉపయుక్తమైన విషయాలు 

* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* యాత్రీకులు "శ్రీ ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 
* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు అవుతుంది.
యాత్రీకులు చేయవలసినవి 

* యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.
* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.
* స్త్రీలకు చీరలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.
* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.
* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.
* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 
* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమైన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.
* మీ గురించి సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవాలి. అవసరమైన సమయాలలో అది ఉపయోగపడుతుంది. 
* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణంగా కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.
* ప్రయాణం చేసే సమయంలో వేగించి ఉన్న పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.
* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.
* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.
* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 
* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.
* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 
* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.
* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.
 అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చినట్లైతే మృత్యువుని కాస్త దగ్గర నుంచి చూసి వచ్చినట్లే . శివుని పై భారం వేసి ఓం నమః శివాయ అంటూ వెళ్తున్నవార్కి యమపాసలు ఏమి చేయగలవు ? 
యాత్రీకులు చేయకూడనివి 
* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.
* సిగరెట్లు, మధుపానం చేయకండి. 
* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.
* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 
* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.
* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 
* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.

వేరోక కథనం

పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహింపజేశాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్‌ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్‌ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్‌ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్లి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది.