Saturday, April 20, 2013

అనకాపల్లిలో వెలసిన నూకాలమ్మ


త్తరాంధ్ర ఇలవేల్పుగా విశాఖ జిల్లా నూకాంబిక ఆలయం పేరొందింది. విశాఖపట్నం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆది, మంగళ, గురువారాల్లో పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నూకాలమ్మను భక్తులు దర్శించుకుంటారు. ప్రతి ఏడాది కొత్త అమావాస్య జాతర ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు నుంచి నెలరోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.నూకాంబిక నెల జాతరలో ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లి సమీప వాసులు ఏ రాష్ట్రంలో ఉన్నా నూకాంబిక నెల జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థాన ఈఓ, నామినేటెడ్ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో దేవస్థానంలో నిర్వహణ కొనసాగుతోంది. ఆలయం చుట్టూ ఆహ్లాదకర వాతావరం కనిపిస్తుంది. వివాహాలకు అనువుగా ఇక్కడ కల్యాణ మండపాలు నిర్మించారు.