Sunday, November 3, 2013

మా ఇంటి దీపావళి,

జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి ఫార్మాసిటీ కాలనీలో.....జరుపుకుంటున్న దీపావళి ద్రుశ్యాలు...!!!
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.క్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంట ఆ లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.
 ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా

 పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.

లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలను పొందండి.
ఆ తరువాత చెరుకుమోసులకు వత్తులు కట్టి వెలిగిస్తారు కొందరు...ఆయుథం కర్రలకు మరి కొందరు గోంగూర కాడలకు వత్తులు కట్టి వెలిగిస్తారు,అదే సమయంలో టపాసులు పేల్చుకుంటారు ,మందుగుండు సామాగ్రితో ఇల్లూదిపారి అందరూ సంతోసంగా గడుపుతారు,

Monday, September 23, 2013

శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంభ లంకెలపాలెం జి వి ఎమ్ సి 56వార్డ్

శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంభ లంకెలపాలెం జి వి ఎమ్ సి 56వార్డ్




Monday, September 9, 2013

తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి.

తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి.

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించు దేవుడు మన గణపతి. అన్నికార్యములకు, ముందుగా పూజింపవలసిన ప్రధమైన దేవుడు విఘ్నేశ్వరుడు. విజయానికి, చదువులకు, జ్నానానికి, దేనికైన మన గణనాథుడే దిక్కు. వినాయకుని ప్రార్ధన, పూజ అనేది చాలా పవిత్రమైనది. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సక్సెస్ న్యూస్.బ్లాగ్ స్పాట్.కామ్ తెలుపుతోంది. వినాయకుడి ఇష్టమైన విషయాలను తెలుసుకుందాం. 
గణేషుడిని గరికతో పూజిస్తే సకల లాభాలు!
వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేని పూజ విఘ్నేశ్వరుని లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితం. పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బైటికి వచ్చిన యముని తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు. ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు.
కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది మునులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.
బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు
వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి. 'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.
21 పత్రాలతో పూజ ఎందుకుచేయాలి!
వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం' అంటే ‘మానవత్వా'న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు.


 చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ' రహస్యం. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.

Friday, August 30, 2013

వరలక్ష్మీ వ్రతం

02ఈ వ్రతం చేసే రోజున స్త్రీలు ఉదయమే మంగళస్నానం చేసి, కొత్త బట్టలు 
03కట్టుకొని, పూజగదిలో కానీ, మరో అనువైన చోటన కానీమంటపం కట్టి దాని మధ్యన 
04ముగ్గులతో తీర్చిదిద్ది కొబ్బరికాయకు లక్ష్మీరూపం అలంకరించి కలశస్థాపన  
05చేసి వరలక్ష్మీ వ్రతమైతే లక్ష్మీ దేవినీ, మంగళగౌరీ వ్రతమైతే మంగళగౌరినీ 
06ఆవాహనం చేసి, షోడశోపచారాలతో పూజిస్తారు.
07పూజానంతరం పసుపు పూసిన తోరం చేతికి కట్టుకొని, సాయంకాలం ఆరతి ఎత్తి, 
08పేరంటంచేస్తారు. తరువాత వరలక్ష్మీ వ్రత కథా మంగళగౌరీ వ్రతకథా చదువుతారు. 
09ఆ కాలంలో దొరికే ఫలాలతో అలంకరించడం, నైవేద్యానికి ఆవిరి కుడుములు వంటి 
10తేలికైన తినుబండారాలను సిద్ధ పర్చడం, అన్నింటినీ ఐదైదుగా పెట్టడం ఆచారం.
11వరలక్ష్మీ కటాక్షం, మంగళగౌరీ  కటాక్షం ఏస్త్రీలపై వుంటుందో వారికి వైధవ్య 
12బాధ వుండదు. వారు సర్వసౌభాగ్యాలతో తులతూగుతారు.
13పూజ సామగ్రి : పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, 
14వత్తులు, గండం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశం, కలశవస్త్రం, అమ్మ వారి ప్రతిమ 
15లేదా విగ్రహం.
16పంచామృతం - అనగా ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనే, పంచదార 
17దీపములు - తైలం, నెయ్యి 
18వస్త్రం - ప్రతితో చేయవచ్చు లేకపోతే పట్టు చీర రవిక (జాకెట్టు గుడ్డ) 
19అమ్మవారికి పెట్టిన తరువాత కట్టుకోవచ్చు.
20మాంగల్యం - పసుపు తాడు దానికి అమ్మవారి ప్రతిమ లేక పసుపు కొమ్ము కత్తుకోవచ్చు
21ఆభరణములు - అమ్మవారికి వేసిన తరువాత వెసుకోవచ్చు 
22పూజ విధానము
23పసుపు ముద్దాతో వినాయకుని తయారుచేసుకొని ఒక పీట మిద బియ్యం పరిచి కలశంలో 
24కొత్తబియ్యం, గుళ్ళు, మాముడి ఆకులు కొబ్బరికాయ వుంచి దానిని పీట మద్యలో 
25ఉంచి పూజకు సిద్ధం చేసి సంకల్పం చేసుకోవలెను.
26తోరము - పసుపుదారంతో ఒక్కొక్క పువ్వు పెట్టి తొమ్మిది ముడులు వేసిన తోరములు మూడు చేసుకోవలెను. 
27ఒకటి అమ్మవారికి, ఒకటి చేయువారికి, ఒకటి పెద్ద ముత్తయిదువుకి
001శ్రావణ వరలక్ష్మి వ్రత విదానం

002వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం లో పౌర్ణిమ కు ముందు వచ్చే శుక్రవారం రోజు చేస్తారు. ఒక వేళ ఆ రోజు కుదరకుంటే, శ్రావణ మాసం లో ఏ శుక్రవారం ఐనా చేసుకోవొచ్చు. వరలక్ష్మికి శుక్రవారం రోజు వరలక్ష్మి అని అమ్మవారిని కొలిచి, పూజ చేసుకుంటారు.
003ఆచమనం

004ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

005(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)


 006ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వేయవలెను)
007విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః
008ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
009ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః
009అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
010ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
011ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

012(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
013ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

014(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
015శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
016ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

017ఓం లక్ష్మినారాయణభ్యయం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
018శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః శ్రీ శచిపురంధరాభ్యం నమః

019శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః

020సర్వేభ్యో దేవేభ్యో నమః మాతృభ్యో నమః, పితృభ్యో నమః
021ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు16-08-2013 జ్యేస్ట నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సత్సంతన సౌభాగ్య శుభఫలాప్యార్ధం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి దేవతా ముధీశ్యా వరలక్ష్మి ప్రీత్యర్ధం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
022(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

023తదంగత్వేన కలశారాధనం కరిష్యే
024శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
025మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
026కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
027ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
028అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
029(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

030శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
031నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
032ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
033కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

034(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

035మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
036జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

037శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

038ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

039ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
040సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

041శ్రీ మహాగణాధిపతికి బెల్లము  లేదా పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).

042వరలక్ష్మి పూజ విధానము :

043అనంతరం శ్రీ వరలక్ష్మి పూజ ప్రారంభం – వరలక్ష్మి ధ్యానమ్

044పద్మసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
045నారాయణప్రియే దేవి సుప్రితాభవ సర్వదా,
046క్షిరోదర్నవ సంభుతే కమలే కమలాలయే
047సుస్థిరా భవమే దేహి సురాసుర నమస్త్రుతే ||
048శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః || ద్యయామి

049(అక్షింతలు వేయండి)

050శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్తలాలయే ,
051ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
052ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.

053(నీళ్ళు చల్లండి )

054శ్లో: ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
055చంద్రకాంత మణిస్థంభ సౌవర్ణం సర్వసుందరం.
056ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

057(అక్షింతలు చల్లండి )

058శ్లో: ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
059గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
060ఓం శ్శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

061(నీళ్ళు చల్లండి )

062శ్లో: వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
063గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
064ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

065(నీళ్ళు చల్లండి )

066శ్లో: శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
067గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
068ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

069(నీళ్ళు చల్లండి )

070శ్లో: వయోదధి ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం
071పంచామృత స్థానమిదం గృహాణ కమలాలాయే
072ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్థానం సమర్పయామి.

073(పంచామృతం చల్లండి )

074గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
075శుదోద్దక స్నాన మిదం గృహాణ విధు సోదరి
076ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుదోద్దక స్నానం సమర్పయామి.

077(నీళ్ళు చల్లండి )

078సురార్చితాగ్నియుగలే పవన ప్రియే
079వస్త్రయుగ్యం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
080ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః వస్త్రయుగ్యం సమర్పయామి.

081( కొత్త బట్టలు లేదా పత్తి సమర్పించండి)

082కేయూర కంకణే దివ్యహర నూపుర మేఖలా
083విభూషణముల్యని గృహాణ ఋషి పూజితే
084ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి.

085(కొత్త ఆభరణాలు ఉంటె లేదా అమ్మవారికి వేయండి)

086తప్తహేమకృత దేవి మాంగల్యం మంగళప్రదం
087మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
088ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః మాంగల్యం సమర్పయామి.

089(అమ్మవారికి మాంగల్యం సమర్పించండి)

090శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
091గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
092ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శ్రీ గంధం సమర్పయామి.

093(అమ్మవారికి శ్రీ గంధం, కుంకుమ సమర్పించండి)

094శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
095హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
096ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

097(అమ్మవారికి అక్షింతలు, పసుపు,కుంకుమ చల్లండి)

098మల్లికా జాజి కుసుమచ్యకైరపిర్వకులైస్తధ
099శతపత్రాయిచ్చ కలార్వై: పూజయామి పూజితే
100ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి.

101(అమ్మవారికి పుష్పములు చల్లండి)

102అధాంగ పూజ:

103ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
104ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
105ఓం పీతాంబరధరాయై నమః - ఊరూం పూజయామి
106ఓం కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
107ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
108ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
109ఓం లలితాయై నమః - భుజాన్ పూజయామి
110ఓం కంభుకంట్ట్యై నమః – కన్ట్టం పూజయామి
111ఓం సుముఖాయై నమః - ముఖం పూజయామి
112ఓం శ్రియై నమః - ఓష్టౌ పూజయామి
113ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
114ఓం సునేత్ర్యై నమః - నేత్రే పూజయామి
115ఓం రమాయై నమః – కర్ణౌ పూజయామి
116ఓం కమలాలయాయై నమః - శిరః పూజయామి
117ఓం శ్రీ వరలక్ష్మ్యే దేవ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి.

118తరువాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర నామములు ( శ్రీ లక్ష్మి అస్తోతరములు) చదవండి ..

119లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .

120శ్లో: దశాంగం గగ్గులో పేతం సుగంధం సుమనోహరం
121ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాణ త్వం
122ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ధూపం సమర్పయామి.

123(అగరు వత్తులను వెలిగించి దూపమును దేవికి చూపించవలెను. సాంబ్రాణి పొగను కూడా వేయవచ్చును )

124శ్లో: ఘ్రుతావర్తి సంయుక్తం మంధకార వినాశకం
125దీపం దాస్యామి తేదేవి గృహాణ ముదితా భవ.
126ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః దీపం సమర్పయామి.

127(దీపమును దేవికి చూపించ వలెను )

128నైవేద్యం షడ్రసోపేతం దధి మద్వాజ్య సంయుతం,
129నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే .
130శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి

131దేవికి ప్రత్యేకించి చేసిన పిండి వంటలు దేవికి సమర్పించి నమస్కరించ వలెను.

132ఘన సార సుగందేన మిశ్రితం పుష్ప వాసితం
133పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం .
134ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పానీయం సమర్పయామి.

135శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి అని భోజనం అయిన తరువాత త్రాగుటకు నీరు ఇచ్చినట్లు భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించ వలెను.

136పూగీ ఫల సమాయుక్తం నాగ వల్లీ దళైర్యుతం
137కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .
138ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

139( తమలపాకులు ,రెండు పోక చెక్కలు వేసి అమ్మవారికి వద్ద ఉంచాలి).

140తరువాత కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి

141నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
142తుభ్యం దాస్యా మ్యహం దేవీ గృహ్యాతాం విష్ణు వల్లభే ||
143శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి.

144(కర్పూర హారతిని వెలిగించి హారతి పాటలు పాడ వచ్చును. )

145పద్మాసనే పద్మ కరే సర్వ లోకైక పూజితే ,
146నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా ||
147శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి.

148(పువ్వులు ,అక్షతలు చేతిలోనికి తీసుకుని ,లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు ,అక్షతలు దేవిపై వేసి కూర్చోన వలెను.)

149యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
150తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
151శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
152( అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలు పువ్వులు దేవిపై వేయవలెను )

153తోర బంధన మంత్రము :

154బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం
155పుత్రా పౌత్రాభి వృదించ సౌభాగ్యం దేహిమే రమే

156ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పునః పూజాంచ కరిష్యే 

157అని చెప్పుకుని, పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .

158ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి .సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి. 

159అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .

160ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ మాతార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను . పిమ్మట ‘ శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.’ 

161అనుకుని దేవి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను.

162అక్షింతలు చేతిలో వేసుకొని వరలక్ష్మీ వ్రత కధ చదవండి లేక వినండి ;

163వరలక్ష్మీ వ్రత కధ


164ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను. 

165పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

166లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం| 
167దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం| 
168శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర గంగాధరాం| 
169త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||

170అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

171ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెము లో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై ఉంచ వలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

172యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజా క్రియాది షు,
173న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ,
174మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన ,
175యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే.
176అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః

177శ్రీ వరలక్ష్మీ దేవతా స్సుప్రీతో వరదో భవతు ,శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి .

178ఇతి పూజా విధానమ్ సంపూర్ణమ్


179శ్రీ వరలక్ష్మీ వాయనదానము:
180ఇచ్చేవారు : ఇందిరా ప్రతిగృహ్ణాతు
181పుచ్చుకునేవారు : ఇందిరావై దదాతిచ
182ఇద్దరు : ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
183ఇచ్చేవారు : ఇస్తినమ్మవాయణం
184పుచ్చుకునేవారు : పుచ్చుకున్తినమ్మ వాయనం
185వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.

186శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి అనుకుని శనగలు (నాన బెట్టినవి ),తాంబూలం (మూడు ఆకులు ,వక్క , అరటి పండు ), రవికల (జాకెట్టు )గుడ్డ ,పువ్వులు మరియు తయారు చేసిన పిండి వంటలను ఒక పళ్ళెము లోనికి 9 రకములు రకమునకు 9 వంతున గాని (లేదా ఎవరి శక్తి అనుసారముగా వారు ) తీసుకుని మరొక పళ్ళెము తో మూసి పైన కొంగును కప్పి ముత్తైదువుకు బొట్టు పెట్టి ఆమెను వరలక్ష్మీ దేవిగా భావించి ఈ వాయనమును అందిస్తూ ఇచ్చువారు ఇస్తినమ్మ వాయనం అని, పుచ్చుకున్నవారు పుచ్చు కొంటినమ్మ వాయనం అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,నా వాయనం అందుకున్నదెవరు అని ఇచ్చేవారు ,నేనమ్మా వరలక్ష్మీ దేవిని అని పుచ్చుకునేవారు అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,అడిగితి వరం అని ఇచ్చువారు ,ఇస్తి వరం అని పుచ్చు కొనువారు మూడు సార్లు అనాలి .ఈ విధంగా వాయనమును దేవికి సమర్పించి నమస్కరించవలెను.

187ఆ రోజు సాయంత్రము ముత్తైదువులను పిలిచి పేరంటం చేసుకొన వచ్చును. (పేరంటం అనగా పసుపు ,కుంకుమ , గంధం, ముత్తైదువులకు ఇచ్చి శనగలు (నాన బెట్టినవి ), తాంబూలం (మూడు ఆకులు ,వక్క ,అరటి పండు ), రవికల (జాకెట్టు ) గుడ్డ ,పువ్వులు ఇవ్వ వలెను.

Saturday, April 20, 2013

అనకాపల్లిలో వెలసిన నూకాలమ్మ


త్తరాంధ్ర ఇలవేల్పుగా విశాఖ జిల్లా నూకాంబిక ఆలయం పేరొందింది. విశాఖపట్నం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆది, మంగళ, గురువారాల్లో పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నూకాలమ్మను భక్తులు దర్శించుకుంటారు. ప్రతి ఏడాది కొత్త అమావాస్య జాతర ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు నుంచి నెలరోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.నూకాంబిక నెల జాతరలో ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లి సమీప వాసులు ఏ రాష్ట్రంలో ఉన్నా నూకాంబిక నెల జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థాన ఈఓ, నామినేటెడ్ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో దేవస్థానంలో నిర్వహణ కొనసాగుతోంది. ఆలయం చుట్టూ ఆహ్లాదకర వాతావరం కనిపిస్తుంది. వివాహాలకు అనువుగా ఇక్కడ కల్యాణ మండపాలు నిర్మించారు.


Sunday, February 17, 2013

శ్రీ సూర్యనారయణమూర్తి దేవాలయం(రాజుపాలెం అనకాపల్లి మండలం విశాఖపట్టణం జిల్లా ఆంద్రప్రదేశ్ )


శ్రీ సూర్యనారయణమూర్తి దేవాలయం(రాజుపాలెం అనకాపల్లి మండలం విశాఖపట్టణం జిల్లా ఆంద్రప్రదేశ్ )

ఆదిదేవ ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర!
దివాకర ! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే.

సప్తాశ్వరధ మారూఢ౦ - ప్రచండం కస్యపాత్మజం!
శ్వేతపద్మధరం దేవం - తం సూర్యం ప్రణ మామ్యహం.

లోహితం రధమారూఢ౦ - సర్వలోక పితామహం!
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం.

త్రైగుణ్యం చ మహాశూరం - బ్రహ్మవిష్ణుమహేశ్వరం!
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం.

బృంహితం తేజసాంపుంజం -వాయు రాకాశ మేవ చ!
ప్రియంచ సర్వలోకానాం - తం సూర్యం ప్రణమామ్యహం.

బంధూకపుష్పసంకాశం - హారకుండభూషితం!
ఏకచక్రధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం.

తం సూర్యం లోకకర్తారం - మహాతేజః ప్రదీపనం!
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం.

తం సూర్యం జగతా నాధం - జ్ఞాన ప్రకాస్యమోక్షదం!
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం.

సూర్యాష్టకం పఠే న్నిత్యం - గ్రహపీడా ప్రణాశనం!



అపుత్రో లభతే పుత్రం - దరిద్రో ధనవాన్భవేత్.

Saturday, January 12, 2013

కాంతులు చిందించే సంక్రాంతి


కాంతులు చిందించే సంక్రాంతి







సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి విశేషాలు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడంవరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటివరకూ దక్షిణాయనంలో సంచరిస్తోన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది.
మకర సంక్రాంతికి ముందురోజు ''భోగి''. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతిలాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవేళ ఉదయాన్నే లేచి ''భోగిమంటలు'' వేస్తారు. భోగిమంటల్లో సూక్ష్మక్రిములను నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్ళలో అడ్డంగా అనిపించే చెక్క సామాను, ఔషధప్రాయమైన వేప తదితర కలపతో వేస్తారు. ఇవి కేవలం చలి కాచుకోడానికే గాక ఆరోగ్యరీత్యా మంచిది. క్రిమికీటకాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం పోతుంది.  
అభ్యంగన స్నానం, కొత్తబట్టలు, పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల సమాగమం లాంటి కార్యక్రమాలతో ఇల్లిల్లూ సందడిగా, సంతోషంగా కనిపిస్తుంది. చిన్నారులున్న ఇళ్ళలో రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుంది.
భోగిపళ్లు అంటే రేగిపళ్ళే. బదరీఫలం అనే పదం నుండి భోగిపండు వచ్చింది. బదరికావనంలో నరనారాయణులు తపస్సు ఆచరించే సమయంలో బదరీ ఫలాలను తిన్నారట. అందుకే భోగిపళ్లు పోయడమంటే నరనారాయణుల ఆశీస్సులు పండడం. రేగిపళ్ళు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తాయి. వాటిని శరీరం మీద పోయడంవల్ల అనారోగ్యాలు నయమౌతాయి. ఇవి తింటే దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉదర సంబంధ జబ్బులు కుదురుతాయి. ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. భోగిపళ్ల వేడుక ముగిసిన తర్వాత ఈ పళ్ళను కూడా పంచిపెడతారు. అవి తిని ఆరోగ్యంగా ఉండాలనేది పరమార్థం.
ఇక మకర సంక్రాంతి మరుసటిరోజు కనుమ. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. వ్యవసాయ కుటుంబాల్లో తెల్లవారుజామున లేచి పనులు మొదలుపెడతారు. పాడి పశువులను కడిగి, కుంకుమ, పూసల గొలుసులు, మువ్వలు, పట్టెడలతో అలంకరిస్తారు. నెల పొడుగునా వాకిళ్ళలో పెట్టిన గొబ్బెమ్మలను పొయ్యికింద పెట్టి పాయసం చేసి మొదట సూర్యునికి, ఆపైన దేవుడి మందిరంలో, తర్వాత పశువుల కొట్టంలో నైవేద్యం పెడతారు. పొలంలో, పశువులశాలలో గుమ్మడికాయ పగలగొట్టి దిష్టి తీస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలకు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.

సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. ఒణికించే చలిలో కూడా అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి వాకిళ్ళలో కళ్ళాపి జల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతుంటారు. లేదా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞాననేత్రం తెరచుకుంటుంది. నదిలో మునిగి, సూర్యునికి అర్ఘ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.
ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది.
సంక్రాంతి సందర్భంగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. తిరుప్పావై పాశురాలను చదువుతారు లేదా వింటారు. వేద మంత్రాలను పఠిస్తారు. యాగాలు నిర్వహిస్తారు. ఇక హరిదాసులు, పులి వేషగాళ్ళు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటల గురించి చెప్పనవసరమే లేదు. చూస్తుండగానే పండుగ వచ్చేస్తుంది. కొత్త బియ్యంతో అరిసెలు, పాలతాలలికలు చేసి దేవునికి నివేదిస్తారు. పేదసాదలకు దానధర్మాలు చేస్తారు. సాయంత్రంపూట బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు.